డీఎస్సీ నోటిఫికేషన్ పై( DSC Notification ) ఏపీ హైకోర్టులో( AP High Court ) విచారణ వాయిదా పడింది.పిటిషన్ పై విచారణలో భాగంగా ఎస్జీటీ టీచర్ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
దీనిపై స్పందించిన న్యాయస్థానం సుప్రీంకోర్టు ( Supreme Court ) నిబంధనలకు వ్యతిరేకంగా నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ఏజీని ప్రశ్నించింది.ఈ క్రమంలోనే తక్షణమే నోటిఫికేషన్ నిలుపుదల చేస్తామని హైకోర్టు తెలిపింది.
ఈనెల 23 నుంచి హాల్ టికెట్లు( Hall Tickets ) ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుందని పిటిషనర్ తెలపగా.నోటిఫికేషన్ కొనసాగటానికి వీలులేదని హైకోర్టు స్పష్టం చేసింది.అయితే ప్రభుత్వ వివరణ తీసుకోవడానికి ఒకరోజు సమయం కావాలని ఏజీ న్యాయస్థానాన్ని కోరారు.దీంతో ఏజీ అభ్యర్థన మేరకు విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.