నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య కొంత గ్యాప్ ఉందని ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టమైంది.జూనియర్ ఎన్టీఆర్ సైతం నందమూరి కుటుంబానికి సంబంధించిన అంశాల గురించి స్పందించడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
అయితే ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడే అవకాశాలు అయితే ఉన్నాయని ప్రచారం జరుగుతుండటం గమనార్హం.దేవర సినిమా( Devara ) దసరా కానుకగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
బాలయ్య బాబీ కాంబో మూవీ( Balakrishna Bobby ) సైతం దాదాపుగా అదే సమయానికి థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.దేవరతో పోటీకి బాలయ్య సై అంటారా అనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.
నందమూరి స్టార్స్( Nandamuri Stars ) పోటీ పడితే ఇద్దరికీ నష్టమంటూ కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.నందమూరి హీరోలకు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.అటు బాలయ్య, ఇటు జూనియర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో కెరీర్ పరంగా జోరుమీదున్నారు.బాలయ్య రెమ్యునరేషన్( Balakrishna Remuneration ) 30 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంటే జూనియర్ ఎన్టీఆర్ పారితోషికం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండటం గమనార్హం.
బాలయ్య బాబీ మూవీ, ఎన్టీఆర్ కొరటాల కాంబో మూవీ ఒకింత భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతుండటం గమనార్హం.
బాలయ్య బాబీ కాంబో మూవీ రిలీజ్ డేట్ గురించి కూడా త్వరలో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది.బాలయ్య బాబీ మూవీ షూట్ 30 శాతం పూర్తి కాగా ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ గా ఎలాంటి అప్ డేట్స్ రావడం లేదు.నందమూరి హీరోలకు ఇతర భాషల్లో సైతం క్రేజ్ పెరుగుతోంది.