ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలకు రిలీజ్ డేట్లను ప్రకటించడం కంటే చెప్పిన తేదీకి రికార్డ్ స్థాయిలో థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయడం, ఆ సినిమాతో సక్సెస్ సాధించడం సమస్యగా మారింది.ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్( NTR Koratala Shiva Combo ) లో తెరకెక్కుతున్న దేవర మూవీ ఇప్పటికే ఎన్నో ఆవాంతరాలను ఎదుర్కొంది.
ఈ సినిమా ప్రకటించిన ఏడాది తర్వాత షూట్ మొదలైంది.ఆచార్య ఫ్లాప్ వల్ల, శ్రీమంతుడు వివాదం వల్ల కొరటాల శివ పర్సనల్ లైఫ్ లో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ) గాయాల వల్ల ఈ సినిమా రిలీజ్ ఏకంగా ఆరు నెలల పాటు పోస్ట్ పోన్ అయింది.అయితే దేవర మూవీ అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ కానుండగా ఈ సినిమా మూడు సెంటిమెంట్లను బ్రేక్ చేయాల్సి ఉంది.
మూడు సెంటిమెంట్లను బ్రేక్ చేస్తే మాత్రమే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.దేవర సినిమా కొరకు జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) తొలిసారి ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ప్రమోషన్స్ చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
దాదాపుగా 9 భాషల్లో అనర్ఘళంగా మాట్లాడే టాలెంట్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఇతర భాషల్లో కూడా దేవర( Devara )పై ఆకాశమే హద్దుగా అంచనాలు పెరిగేలా ప్లాన్ చేస్తున్నారు.సినిమా ఇండస్ట్రీలో జక్కన్న తర్వాత మూవీ ఫ్లాప్ అనే సెంటిమెంట్ ఉంది.ఇప్పటివరకు ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు.కొరటాల శివ సైతం ఆచార్య( Acharya సినిమాతో ఈ సెంటిమెంట్ వల్ల ఫ్లాప్ ఖాతాలో వేసుకున్నారు.
అయితే దేవర సినిమాతో ఎన్టీఆర్, కొరటాల శివ ఈ సెంటిమెంట్ కు చెక్ పెడతారేమో చూడాలి.
జూనియర్ ఎన్టీఆర్ దసరా( Dasara ) కానుకగా బృందావనం, ఊసరవెల్లి, రామయ్యా వస్తావయ్యా సినిమాలను రిలీజ్ చేయగా ఈ సినిమాలలో బృందావనం మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఊసరవెల్లి, రామయ్యా వస్తావయ్యా సినిమాలు ఆశించిన ఫలితాలను అందుకోలేదు.దసరా తారక్ కు పెద్దగా అచ్చిరాలేదనే సెంటిమెంట్ ను సైతం ఎన్టీఆర్ బ్రేక్ చేయాల్సి ఉంది.
జూనియర్ ఎన్టీఆర్ తండ్రీ కొడుకుల పాత్రల్లో( Father Son Role ) కనిపించిన ఆంధ్రావాలా, శక్తి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందుకోలేదు.ఈ సెంటిమెంట్ ను సైతం దేవర బ్రేక్ చేస్తుందో లేదో చూడాల్సి ఉంది.
జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లతో మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.