ఏలూరు జిల్లా దెందులూరు సిద్ధం భారీ బహిరంగ( Siddham Meeting ) సభలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.రామాయణం, మహా భారతంలో ఉన్న విలన్లు చంద్రబాబు( Chandrababu naidu ) అండ్ కో అని విమర్శించారు.
రాష్ట్రంలో అభివృద్ధిపై టీడీపీ కుట్రలు చేస్తుందన్నారు.ఈ నేపథ్యంలో చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలను చీల్చిచెండాడండని తెలిపారు.14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు.గత టీడీపీ( TDP ) పాలనలో ఏం జరిగిందో, వైసీపీ 57 నెలల పాలనలో ఏం జరిగిందో ప్రజలంతా ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పారు.ప్రతి గ్రామంలో సచివాలయం పెట్టామన్న సీఎం జగన్( CM Jagan ) ప్రతి నెల ఒకటో తేదీన అవ్వాతాతలు, వికలాంగులకు రూ.3 వేల పెన్షన్ ఇస్తున్నామని పేర్కొన్నారు.
వివక్ష, లంచాలు లేని వ్యవస్థను తీసుకొచ్చింది వైసీపీ అని తెలిపారు.కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియం( English medium ) తీసుకొచ్చామన్న ఆయన విద్యార్థులను ట్యాబ్ లు ఇచ్చామని పేర్కొన్నారు.అలాగే ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీ, బీసీలకు 68 శాతం మంత్రి పదవులు ఇచ్చామని చెప్పారు.31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు అసైన్డ్, 22ఏ భూములపై శాశ్వత భూహక్కు కల్పించామని తెలిపారు.చెప్పిన ప్రతి మాటను నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీ అని, మ్యానిఫెస్టో( Manifesto )కు విశ్వసనీయత తీసుకొచ్చింది మీ బిడ్డ జగన్ అని స్పష్టం చేశారు.