అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీకి ఏపీ కాంగ్రెస్( AP Congress ) దరఖాస్తులను సిద్ధం చేసింది.ఈ మేరకు ఇవాళ్టి నుంచి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది.
పార్టీ ఫండింగ్ కింద కొంత డబ్బు డిపాజిట్ చేసి నేతలు దరఖాస్తులను స్వీకరించనున్నారు.ఇందులో భాగంగా లోక్ సభ జనరల్ స్థానాల్లో దరఖాస్తుకు రూ.25,000 నగదు చెల్లించాల్సి ఉంటుంది.రిజర్వ్డ్ లోక్ సభ స్థానాల్లో దరఖాస్తుకు రూ.15,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
అలాగే జనరల్ అసెంబ్లీ స్థానాలకు రూ.10,000 డిపాజిట్, రిజర్వ్ అసెంబ్లీ స్థానాలకు రూ.5,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.ఈ క్రమంలోనే డొనేషన్ ఫర్ దేశ్ అనే లింకులో నగదును డిపాజిట్ చేయాలని పార్టీ సూచించింది.కాగా అప్లికేషన్ తో పాటు డిపాజిట్ రశీదు అందించాలని కాంగ్రెస్ తెలిపింది.
మరోవైపు ఇద్దరు ఎస్సీ, ఒక మైనారిటీ అభ్యర్థికి మాణిక్కం ఠాగూర్ మొదటగా అప్లికేషన్ ఇవ్వనున్నారు.ఈ మేరకు మడకశిరలో కె సుధాకర్, బద్వేల్ లో కమలమ్మ, గుంటూరు తూర్పులో మస్తాన్ వలీకి ఠాగూర్ ఇవ్వనున్నారు.