టీడీపీ నేత నారా లోకేశ్( Nara Lokesh ) పై సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ విజయవాడలోని ఏసీబీ కోర్టు( ACB Court )లో విచారణ జరగనుంది.రెడ్ బుక్ లో అధికారుల పేర్లు ఉన్నాయని బెదిరింపులకు పాల్పడ్డారని సీఐడీ అభియోగిస్తూ కోర్టులో పిటిషన్ వేసింది.
41 ఏ నిబంధనలకు విరుద్ధంగా లోకేశ్ వ్యవహరించారని సీఐడీ మెమో దాఖలు చేసింది.ఈ నేపథ్యంలో పిటిషన్ పై లోకేశ్ తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో కౌంటర్ దాఖలు చేయనున్నారు.