ప్రస్తుత చలికాలంలో ప్రధానంగా ఎదుర్కొనే జుట్టు సమస్యల్లో డ్రై హెయిర్( Dry Hair ) ఒకటి.అందులోనూ రెగ్యులర్ గా తల స్నానం చేసేవారు, హెయిర్ స్టైలింగ్ టూల్స్ ను అధికంగా వినియోగించేవారు డ్రై హెయిర్ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటారు.
ఈ క్రమంలోనే పొడిబారిన జుట్టును రిపేర్ చేసుకునేందుకు సెలూన్ కు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.కానీ ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే ఇంట్లోనే పైసా ఖర్చు లేకుండా పొడిబారిన జుట్టును సిల్కీగా( Silky Hair ) మార్చుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు షియా బటర్( Shea Butter ) వేసుకోవాలి.
ఈ బటర్ లో రెండు టేబుల్ స్పూన్లు మందారం పొడి, మూడు టేబుల్ స్పూన్లు కోకోనట్ ఆయిల్( Coconut Oil ) వేసుకుని స్పూన్ సహాయంతో అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.పూర్తిగా కలిసిన తర్వాత ఆ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

ముప్పై లేదా నలభై నిమిషాల అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.జుట్టును తేమగా ఉంచే సహజ కండీషనర్స్ లో షియా బటర్ ఒకటి.అలాగే జుట్టును హానికరమైన యూవీ కిరణాలు( UV Rays ) నుండి రక్షించగల కొవ్వు ఆమ్లాలు మరియు ఇతర ముఖ్యమైన పోషకాలు షియా బటర్ లో మెండుగా నిండి ఉంటాయి.

అందువల్ల షియా బటర్ ను ఇప్పుడు చెప్పిన విధంగా కనుక వాడితే డ్రై హెయిర్ అన్న మాటే అనరు.ఈ సింపుల్ రెమెడీతో పొడి బారిన జుట్టును సహజంగానే సిల్కీగా మరియు షైనీగా మెరిపించుకోవచ్చు.పైగా ఈ షియా బటర్ మాస్క్ ను వేసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లు దృఢంగా మారతాయి.
హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.మరియు జుట్టు చిట్లడం పెరగడం వంటి సమస్యలు సైతం దూరం అవుతాయి.