దానిమ్మ పంటను ఆశించి తీవ్ర నష్టం కలిగించే విల్డ్ తెగుళ్ల నివారణ కోసం చర్యలు..!

దానిమ్మ పంటను( Pomegranate harvest ) ఆశించి తీవ్ర నష్టం కలిగించే విల్డ్ తెగులు ఒక శిలీంద్రం ద్వారా పంటను ఆశిస్తాయి.ఈ శిలీంద్రాలు( Fungi ) తెగులు సోకిన మొక్కల భాగంలో 190 రోజుల వరకు, మట్టిలో కనీసం నాలుగు నెలల వరకు చురుకుగా మనుగడ సాగిస్తాయి.

 Actions For The Prevention Of Wild Pests That Cause Serious Damage To The Pomegr-TeluguStop.com

నేలను తాకే మొక్కల భాగాలకు గాయాలు అయితే వాటి ద్వారా ఈ తెగులు మొక్కలు ఆశిస్తాయి.వేర్లకు మాత్రం ఎటువంటి గాయాలు లేకుండానే ఈ తెగులు సోకుతాయి.

ఈ విల్ట్ తెగులు ఆశించిన దానిమ్మ చెట్ల కొమ్మలు క్రమంగా పసుపు రంగులోకి మారుతాయి.ఆ తర్వాత ఇది మొత్తం చెట్టుకు వ్యాపిస్తుంది.ఇక క్రమంగా ఆకులు వాలిపోవడం, రాలిపోవడం మొదలవుతుంది.ఈ తెగుళ్ల వ్యాప్తి తీవ్రంగా ఉంటే మొక్కలలో ఒకేసారి మొత్తం ఆకులు రాలిపోయే అవకాశం ఉంది.

ఈ తెగుళ్లు సోకితే మొక్క కాండం నిటారుగా చీరడం జరుగుతుంది.ఈ తెగులు సోకిన మొక్కల నాడీ కణజాలంలో ముదురు బూడిద- గోధుమ రంగు గీతాలు ఉంటాయి.

ఈ తెగుళ్లు పంటను ఆశించకుండా ఉండాలంటే.దానిమ్మ తోటలో పనులు చేసేటప్పుడు చెట్లకు ఎలాంటి గాయాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.ఈ తెగుళ్ళకు అతిధులు కానీ మొక్కల రకాలతో దానిమ్మ తోటలో పంట మార్పిడి చేయాలి.వేర్లు ఒకదానికొకటి తగలకుండా ఉండడం కోసం మొక్కల మధ్య దూరం ఉండేటట్లు నాటుకోవాలి.

సేంద్రీయ పద్ధతిలో ఈ తెగులను అరికట్టాలంటే. బాసిల్లస్ సబ్లిటిస్ ( Bacillus subtilis )నేలపై చల్లడం వల్ల ఈ తెగుళ్లను పూర్తిగా నివారించవచ్చు.వేప, క్రాంజ్, మహూవా, ఆముదం కేక్ లతో కూడా ఈ తెగులకు చెక్ పెట్టవచ్చు.ఇక రసాయన పద్ధతిలో ఈ తెగులను అరికట్టాలంటే.దానిమ్మ మొక్కలు నాటడానికి ముందు ఫార్మాలిన్ (0.2%) తో మట్టిని శుద్ధి చేసి ఈ తెగులను నియంత్రించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube