ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్( YS Jagan ) విజయవాడ నడిబొడ్డులో 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు.
రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన జన సందోహంతో విజయవాడ కిటకిటలాడింది.విజయవాడ( Vijayawada ) స్వరాజ్య మైదానంలో జరిగిన ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.
కార్యక్రమంలో భాగంగా లేజర్ లైట్ షో అందరినీ ఆకర్షించింది.ఈ విగ్రహం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం.ఈ విగ్రహం 81 అడుగుల వేదిక ఏర్పాటు చేసి దాని మీద 125 అడుగుల మహా విగ్రహం మొత్తంగా చూసుకుంటే 206 అడుగుల ఎత్తైనది.ఈ కార్యక్రమానికి వైసీపీ పార్టీకి చెందిన మంత్రులు, నాయకులు భారీగా హాజరయ్యారు.ఈ కార్యక్రమం అనంతరం సీఎం జగన్ సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు.“నేడు మన ప్రభుత్వంలో జరిగిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గారి( Dr BR Ambedkar ) విగ్రహావిష్కరణ సందర్భంగా విజయవాడ సామాజిక చైతన్య వాడలా కనిపించింది.
మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ విగ్రహం సామాజికన్యాయ మహాశిల్పం.స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా గుర్తొచ్చినట్టు ఇకపై స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే విజయవాడ గుర్తొస్తుంది.ఈ విగ్రహం మన ప్రభుత్వం ఈ 56 నెలల్లో అనుసరించిన సామాజికన్యాయానికి నిలువెత్తు నిదర్శనం.వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను, ఆర్థిక చరిత్రను, మహిళా చరిత్రను మార్చిన ఓ సంఘ సంస్కర్త, ఓ మరణంలేని మహనీయుడి విగ్రహాన్ని నేడు విజయవాడలో ఆవిష్కరించాం” అని పోస్ట్ పెట్టడం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం 18.18 ఎకరాల్లో దాదాపు ₹400 కోట్లకు పైగా ఖర్చుతో పనులు చేపట్టడం జరిగింది.ఈ అంబేద్కర్ మహా విగ్రహం ప్రాంగణంలో అందమైన గార్డెన్, మ్యూజియం, లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగింది.వీటిలో అంబేద్కర్ బాల్యం, విద్యా, ఉద్యోగం, రాజకీయ జీవితంతో పాటు పోరాటాలు ఇంకా రాజ్యాంగ నిర్మాణ ఛాయచిత్రాలను ప్రదర్శించే విధంగా రూపొందించడం జరిగింది.