మహిళలు అన్ని రంగాల్లో ఉద్యోగాలు సాధించాలని ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నా వేర్వేరు కారణాల వల్ల ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య అంతకంతకూ తగ్గుతోంది.తాజాగా ఏపీలో ఎస్సై తుది ఫలితాలు రిలీజైన సంగతి తెలిసిందే.
ప్రకాశం జిల్లా( Prakasam )లోని తిమ్మసముద్రం గ్రామానికి చెందిన అలేఖ్య సివిల్ ఎస్సైగా ఉద్యోగం సాధించి ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.ప్రస్తుతం ఈమె కొత్తపట్నం కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు.

2014 సంవత్సరంలో బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేసిన అలేఖ్య భర్త రామరాజు కూడా కానిస్టేబుల్ కావడం గమనార్హం.డిగ్రీ పూర్తి కాకముందే కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించిన అలేఖ్య తన సక్సెస్ తో ప్రశంసలు పొందుతున్నారు.

ఒకవైపు కానిస్టేబుల్ ( Constable )గా పని చేస్తూనే తన కష్టంతో ఆమె ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకున్నారు.ఒకప్పుడు కానిస్టేబుల్ గా పని చేసిన అలేఖ్య ఎస్సై జాబ్ సాధించే స్థాయికి ఎదగడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో అలేఖ్య ఒంగోలు( Ongole ) తాలూకా, ఒంగోలు పోలీస్ స్టేషన్లలో పని చేశారని సమాచారం అందుతోంది.ఆమె సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తోంది.ఎస్సై లక్ష్యాన్ని సాధించే విషయంలో ఆమెకు భర్త రామరాజు నుంచి కూడా ఎంతో సపోర్ట్ లభించిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.అలేఖ్య సివిల్ ఎస్సై ఉద్యోగానికి ఎంపిక కావడంతో ఆమె కుటుంబ సభ్యుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
అలేఖ్య బాల్యం నుంచి బాగా చదివేవారని తెలుస్తోంది.అలేఖ్య ఏకైక సంతానం కావడంతో తల్లీదండ్రులు సైతం ఆమెను ఎంతో ప్రోత్సహించారని సమాచారం అందుతోంది.
కూలిపనులకు వెళ్తూ ఆమె తల్లీదండ్రులు అలేఖ్యను చదివించారని భోగట్టా.అలేఖ్య దంపతులకు ఇద్దరు కొడుకులు అని సమాచారం.
అలేఖ్య కెరీర్ పరంగా మరింత ఎదిగి మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిద్దాం.