బిగ్ బాస్ ( Bigg Boss) సీజన్ సెవెన్ కార్యక్రమం ఎంతో మంచి రేటింగ్ సొంతం చేసుకుని సక్సెస్ సాధించగా అదే స్థాయిలో వివాదాలలో కూడా నిలిచిన సంగతి తెలిసిందే.బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్లుగా పాల్గొన్నటువంటి వారిలో శివాజీ ( Shivaji ) అమర్ ( Amardeep Chowdary ) ఇద్దరు కూడా రెండు బ్యాచులుగా విడిపోయారు.
ఇలా ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి చివరి వరకు కూడా వీరి మధ్య గొడవలు జరుగుతూనే వచ్చాయి.అమర్ పట్ల శివాజీ బ్యాచ్ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
అదే విధంగా అమర్ పల్లవి ప్రశాంత్ ( Pallavi prashanth )ను టార్గెట్ చేయడంతో ఈయన కూడా వారికి శత్రువుగా మారిపోయారు.
ఇలా ఈ వివాదం గ్రాండ్ ఫినాలే వరకు కొనసాగుతూ చివరికి ప్రశాంత్ అభిమానులు అమర్ కారుపై దాడి చేసే వరకు వెళ్లింది.ఇలా దాడి జరగడంతో బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన ప్రశాంత్ జైలుకు కూడా వెళ్లి వచ్చారు.అయితే చాలా రోజుల తర్వాత అమర్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ బిగ్ బాస్ కార్యక్రమం గురించి పలు విషయాలను వెల్లడిస్తున్నారు.
బిగ్ బాస్ కార్యక్రమంలో స్టార్ మా సీరియల్ బ్యాచ్ కి బాగా సపోర్ట్ చేస్తుంది అంటూ శివాజీ పలు సందర్భాలలో తెలిపారు.
ఇక ఈ విషయం గురించి అమర్ మాట్లాడుతూ శివాజీకి తన స్టైల్ లోనే కౌంటర్ ఇచ్చారు.స్టార్ మా మాకు సపోర్ట్ చేస్తుంది అంటే నేను ప్రశాంత్ ను టార్గెట్ చేసే సన్నివేశాలను కట్ చేసి ఉండవచ్చు తనని తోసుకుంటూ వెళ్లిన సన్నివేశాలను కూడా కట్ చేసి చూపించవచ్చు కానీ అలా చేయలేదు.అలాగే స్టార్ మా మాకే కనక సపోర్ట్ చేసి ఉంటే నేను రన్నర్ కాకుండా విన్నర్( Winner ) అయ్యే వాడినని ఈ సందర్భంగా అమర్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
బిగ్ బాస్ పూర్తి అయిన తర్వాత కూడా అమర్ శివాజీ ఇద్దరు కూడా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు.దీంతో వీరి మధ్య ఇంకా కోల్డ్ వార్ నడుస్తూనే ఉందని పలువురు వీరి వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు.