ప్రశాంత్ వర్మ( Prashanth Varma )… ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఈ పేరు వినిపిస్తుంది.హనుమాన్ చిత్రం( Hanuman ) ప్రశాంత్ వర్మకి మంచి క్రేజ్ ని అయితే తీసుకొచ్చింది కానీ అది ఎంతవరకు నిలబడుతుంది అనేది ఈ చిత్రం విడుదలయితే గాని తెలియదు.
అయితే తేజ సజ్జా ఈ చిత్రంలో హీరో గా నటిస్తుండగా వీరు ఇద్దరు కలిసి చేస్తున్న మూడవ సినిమా హనుమాన్.అయితే ప్రశాంత్ వర్మ పేరు ఇంతలా వినిపించడానికి అతడికి ఇంత క్రేజ్ రావడానికి గల కారణాలు ఏంటి? తేజ సజ్జా( Teja Sajja ( నే ఇంత పెద్ద చిత్రంలో హీరోగా ఎందుకు పెట్టుకున్నాడు.వీరి మధ్య ఉన్న స్నేహం ఏంటి అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం.

ప్రశాంత్ వర్మ మొట్టమొదటగా “అ”( Awe ) అనే ఒక చిత్రానికి దర్శకత్వం వహించాడు ఈ సినిమాను హీరో నాని ప్రొడ్యూస్ చేయడం విశేషం.ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా నటించిన కల్కి( Kalki ) అనే సినిమాకి కూడా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు.ఇక మూడవ సినిమాగా 2021 లో తేజ సజ్జ హీరోగా జాంబిరెడ్డి( Zombie Reddy ) అనే సినిమాకు దర్శకత్వం వహించిన ప్రశాంత వర్మ ఆ తర్వాత అద్భుతం అనే మరో సినిమాకి సైతం డైరెక్ట్ చేశాడు ఈ సినిమాలో తేజ అనే హీరో కాగా రాజశేఖర్ కుమార్తె హీరోయిన్ గా నటించింది.
డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాని ప్రేక్షకులు బాగానే రిసీవ్ చేసుకున్నారు.

దాంతో హనుమాన్ సినిమా ను మరోమారు తేజాతోనే ప్రశాంత్ వర్మ చేయాలని నిర్ణయించుకున్నాడు.అయితే ఈ సినిమా భారీ గ్రాఫిక్స్ తో పాండే వ్యాప్తంగా విడుదల చేయాలనుకోవడంతో ఇంత చిన్న హీరోతో ఇంత పెద్ద సినిమా ఎలా ప్లాన్ చేశాడు ప్రశాంత్ వర్మ అని అందరూ మాట్లాడుకున్నారు.సరే షూటింగ్ ఏదో పూర్తయింది ట్రైలర్ టీజర్( Hanuman Trailer ) అని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.
గ్రాఫిక్స్ వరకు కూడా చాలా బాగా వచ్చింది అని అనుకుంటుండగా ఇప్పుడు మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకి పోటీగా ఈ చిత్రం నిలబడటమే అందరూ ఈ సినిమా గురించి మాట్లాడుకోవడానికి ఒక కారణంగా నిలిచింది.ఓవైపు ప్రశాంత్ వర్మ తేజ చిత్రానికి థియేటర్స్ తక్కువగా ఇస్తున్నారు అని ఎంత గొడవ పడుతున్న దిల్ రాజు( Dil Raju ) వీరికి ఎలాంటి గ్యాప్ ఇవ్వడం లేదు.
అయితే ప్రశాంత్ తనపై ఉన్న నమ్మకంతో ఈ సినిమాను మహేష్ బాబుకు పోటీగా దించడానికి సిద్ధమైపోయాడు.