ఒకప్పుడు పేద కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ జీవనం గడిపి ఉన్నతస్థాయికి చేరుకున్న వాళ్ల సక్సెస్ స్టోరీలు( Success Stories ) ఎంతోమందిలో స్పూర్తి నింపుతాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.అలా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న స్థాయి నుంచి యూట్యూబ్ లో వీడియోలు చేసే స్థాయికి గౌరవ్ చౌధురి( Gaurav Chaudhary ) ఎదిగారు.
మన దేశంలోని టాప్ టెక్ గురులలో ఒకరైన గౌరవ్ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయి.
రాజస్థాన్ రాష్ట్రంలోని( Rajasthan ) అజ్మేర్ లో ఉన్న చిన్న రేకుల ఇంట్లో గౌతవ్ తండ్రి కిరణా షాప్ ను నిర్వహించేవారు.
తర్వాత రోజుల్లో గౌరవ్ తండ్రి సంపాదన సరిపోక దుబాయ్ కు వెళ్లాడు.ఇంటర్ లోనే కోడింగ్ నేర్చుకున్న గౌరవ్ లెక్చరర్లు, స్నేహితుల సహకారంతో దుబాయ్ లోని బిట్స్ పిలానీలో( BITS Pilani ) చదువుకున్నాడు.
చదువు పూర్తైన తర్వాత దుబాయ్ పోలీస్ డిపార్టుమెంట్ లో సర్టిఫైడ్ సెక్యూరిటీ సిస్టమ్స్ సర్వీస్ ఇంజనీర్ గా ఆయన చేరారు.
చేసిన అప్పులను తీర్చేసిన తర్వాత గౌరవ్ టెక్నికల్ గురూజీ( Technical Guruji ) పేరుతో యూట్యూబ్ ఛానల్ ను మొదలుపెట్టి ప్రస్తుతం రెండున్నర కోట్ల మంది సబ్ స్క్రైబర్లను కలిగి ఉన్నారు.యూట్యూబ్( Youtube ) ద్వారా గౌరవ్ ఇప్పటివరకు 400 కోట్ల రూపాయలు సంపాదించారని సమాచారం అందుతోంది.రష్యాలో బంగారు ఐఫోన్లను గౌరవ్ తయారు చేయించుకున్నారు.
ప్రముఖ సంస్థలు సైతం గౌరవ్ ను ఆహ్వానించి వాళ్ల టెక్నాలజీకి సంబంధించిన వివరాలను పంచుకున్నారు.ఆపిల్ సీఈవో టిమ్ కుక్( Apple CEO Tim Cook ) గౌరవ్ ను కలవాలని అనుకొని ఈ ఏడాది ముంబైలో ఓపెన్ చేసిన ఆపిల్ స్టోర్ కు ఆయనను ఆహ్వానించారు.గౌరవ్ సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.గౌరవ్ కెరీర్ పరంగా మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఎంతోమందికి స్పూర్తిగా నిలవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.