ప్రముఖ నటుడు నానా పటేకర్( Nana Patekar ) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఎన్నో సినిమాల సక్సెస్ లో నానా పటేకర్ కీలక పాత్ర పోషించారు.
హిందీ, మరాఠీ సినిమాలలో ఎక్కువగా నటించిన నానా పటేకర్ ఫిల్మ్ ఫేర్ అవార్డులను( Filmfare Awards ) సైతం సొంతం చేసుకున్నారు.కొన్ని సినిమాలలో నానా పటేకర్ పాటలు కూడా పాడారు.28 సంవత్సరాల వయస్సులోనే తండ్రిని కోల్పోయిన నానా పటేకర్ ఈ స్థాయికి చేరుకోవడానికి పడిన కష్టం అంతాఇంతా కాదు.
ఆ తర్వాత నానా పటేకర్ తన మొదటి కొడుకును సైతం కోల్పోయాడు.ఈ మధ్య కాలంలో తండ్రీ పిల్లల మధ్య దూరం పెరుగుతోందని మా బాల్యంలో ఇలా ఉండేది కాదని అప్పట్లో మా మధ్య అంతర్లీనంగా ప్రేమ ఉండేదని నానా పటేకర్ చెప్పుకొచ్చారు.మా నాన్న బిజినెస్ ను ఎవరో లాక్కోవడం వల్ల మేము దివాళా తీశామని ఆయన అన్నారు.13 ఏళ్ల వయస్సులోనే నేను పనికి వెళ్లడం మొదలుపెట్టానని నానా పటేకర్ తెలిపారు.
నెలంతా పని చేస్తే 35 రూపాయలు ఇచ్చేవారని రోజుకు ఒకపూట భోజనం పెట్టేవారని ఆయన పేర్కొన్నారు.కొంతకాలం క్రితం నానా పటేకర్ వ్యాక్సిన్ వార్( Vaccine War ) అనే సినిమాలో నటించగా ప్రస్తుతం లాల్ బత్తి అనే ఓటీటీ సినిమాలో నటిస్తున్నారు.లాల్ బత్తి సినిమా( Laal Batti Movie ) ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.
నానా పటేకర్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
ప్రముఖ హీరోయిన్ తనూశ్రీ దత్తా( Tanushree Dutta ) నానా పటేకర్ గురించి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.నానా పటేకర్ పై తనూశ్రీ దత్తా లైంగిక ఆరోపణలు చేశారు.అయితే ఆ ఆరోపణలు ప్రూవ్ కాలేదు.
నానా పటేకర్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించి మరిన్ని విజయాలను సాధించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.