చైనాలో వింత కేసు.. అమ్మమ్మ ప్రాపర్టీ కోసం తల్లిదండ్రులపై పోరాటం..

చైనా( China )లో ఒక వింత కేసు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.షాంఘైకి చెందిన ఓ యువతి తన అమ్మమ్మ అపార్ట్‌మెంట్‌ అమ్మాలంటూ తల్లిదండ్రులపై దావా వేసింది.

 Strange Case In China Fight Against Parents For Grandmother S Property, Young Wo-TeluguStop.com

తల్లిదండ్రులపై కూతురు ఆస్తికోసం కేస్ ఫైల్ చేయడం చైనా దేశం వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.పేరెంట్స్ దానిని విక్రయించాలని లేదా డబ్బులో వాటా ఇవ్వాలని ఆమె కోరుతోంది.

విదేశాల్లో చదువుకోవడానికి ఆమెకు డబ్బు కావాలట. అపార్ట్‌మెంట్ అమ్మమ్మకి చెందినది, ఆమె పాత ఇల్లు కూల్చివేసినప్పుడు ప్రభుత్వం ఆ ఇళ్లు ఇచ్చింది.

తల్లిదండ్రులు ఆస్తిపై వారి పేర్లను, వారి కుమార్తె పేరును రాశారు.

Telugu China, Grandmothers, Shanghai, Young-Latest News - Telugu

అయితే అమ్మమ్మ చనిపోవడంతో దానిని విక్రయించి డబ్బులు పంచేందుకు అంగీకరించారు.కానీ వారి కుమార్తె టియాన్, వేరే దేశంలో తన ఖరీదైన విద్యకు మనీ చెల్లించడానికి త్వరగా అపార్ట్‌మెంట్ విక్రయించాలనుకుంది.అపార్ట్‌మెంట్ విలువలో మూడింట ఒక వంతు తనకు తల్లిదండ్రులు మనీ ఇవ్వాలని ఆమె భావిస్తుంది.అయితే కుమార్తె ఖర్చులు, అప్పుల కోసం ఇప్పటికే దాదాపు 500,000 యువాన్లు (సుమారు రూ.58 లక్షలు) చెల్లించామని పేరెంట్స్ చెబుతున్నారు.విదేశాల్లోని పాఠశాలలతో సన్నిహితంగా ఉండటానికి కూడా ఆమెకు సహాయం చేశామని చెప్పారు.

Telugu China, Grandmothers, Shanghai, Young-Latest News - Telugu

అయితే కుటుంబం ఇంకా కలిసి ఉన్నందున టియాన్ వ్యాజ్యాన్ని కోర్టు అంగీకరించలేదు.కుటుంబం విడిపోనంత కాలం తల్లిదండ్రులు ఆస్తిని పంచుకునేలా చేయడానికి చట్టపరమైన కారణం లేదని కోర్టు పేర్కొంది.చైనీస్ సంస్కృతిలో తల్లిదండ్రులను గౌరవించడం, చూసుకోవడం సాంప్రదాయ ధర్మమని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.

తల్లిదండ్రులు అపార్ట్మెంట్ అమ్మితే, అమ్మమ్మ నివసించడానికి ఎక్కడా ప్లేస్ ఉండేది కాదు.అందుకే ఆమె బతికున్నంత వరకు దానిని అమ్మలేదు ఇప్పుడు కూడా అమ్మడానికి ఇష్టపడడం లేదు.

అందుకే తియాన్ ఆమె తల్లిదండ్రులపై కేసు పెట్టింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube