Rana: ఆ మాట అన్నందుకు నిన్ను రెండు పీకాల్సింది.. డైరెక్టర్ పై రానా షాకింగ్ కామెంట్స్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీలలో దగ్గుబాటి ఫ్యామిలీ ఒకటి.దగ్గుబాటి రామానాయుడు నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తున్నారు.

 Hero Rana Shocking Comments On Director Harish Shankar-TeluguStop.com

ఈయన నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకోగా ఈయన వారసులు సురేష్ బాబు నిర్మాతగా కొనసాగుతున్నారు.వెంకటేష్ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు ఇక సురేష్ బాబు వారసుడిగా రానా (Rana) ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న సంగతి తెలుస్తుంది.

రానా పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

రానా పాన్ ఇండియా స్థాయిలో నటించిన బాహుబలి సినిమాలో ఈయన విలన్ పాత్రలో నటించారు.

ఈ సినిమాలో మాత్రమే కాకుండా ఈయన పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాలో కూడా విలన్ పాత్రలో నటించి మెప్పించారు.ఇక రానా కేవలం హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

అదేవిధంగా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నారు.ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటే రానా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈయన సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) కు తన స్టైల్ లో భారీ కౌంటర్ ఇచ్చారు.

నిన్ను రెండు పీకాల్సిందే అంటూ రానా ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.అసలు రానా హరీష్ శంకర్ ని ఎందుకు ఇలా అన్నారు అనే విషయానికి వస్తే ఇటీవల బాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి అన్ స్టాపబుల్ (Unstoppable Show) కార్యక్రమానికి హరీష్ శంకర్ హాజరైన సంగతి మనకు తెలిసిందే.ఈ కార్యక్రమంలో భాగంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ ఏ భర్త అయినా భార్యకు ఐ లవ్ యు అని చెప్పాల్సిందే అంటూ మాట్లాడారు.

దీంతో బాలకృష్ణ భర్త భార్యకు ఐ లవ్ యు చెప్పడం ఏంటి అంటూ మాట్లాడారు.

ఇలా నా చేత నా భార్యకు ఐ లవ్ యు చెప్పించినటువంటి నటుడు రానా అంటూ బాలకృష్ణ ఈ సందర్భంగా రానా గురించి చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.రానా ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు బాలకృష్ణ చేత తన భార్య వసుంధరకు( Vasundhara ) ఐ లవ్ యు చెప్పించారట ఇలా తన విషయంలో ఆ పని చేసినది మై ఎల్డర్ బ్రదర్ రానా అంటూ ఈ సందర్భంగా బాలయ్య చెప్పడంతో వెంటనే హరీష్ శంకర్ రానా ఆ సమయంలో చేసిన రిస్క్ కి మీరు రెండు పీకిన పీకాల్సింది ఆ సందర్భంలో అంటూ హరిష్ శంకర్ రానా మాటలను ఉద్దేశించి మాట్లాడారు.

ఈ వ్యాఖ్యలపై రానా ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అవుతూ అలా అన్నందుకు నిన్ను రెండు పీకాల్సింది అంటూ కామెంట్ చేశారు.అయితే ఈయన కామెంట్ చూస్తే కాస్త సీరియస్ గానే చెప్పారని తెలుస్తోందంటూ రానా పోస్ట్ పై కామెంట్లు చేస్తున్నారు.సాధారణంగా బాలకృష్ణ తనకు నచ్చని మాటలు మాట్లాడిన నచ్చని పనులు చేసిన నిర్మొహమాటంగా ఇతరులపై చేయి చేసుకుంటారని విషయం మనకు తెలిసిందే.

ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని హరీష్ శంకర్ ఆ మాటలు మాట్లాడారని తెలుస్తుంది .కానీ రానా మాత్రం చాలా భిన్నంగా రియాక్ట్ కావడంతో ఈ పోస్ట్ కాస్త వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube