శివాజీని గెలిపించాలంటూ అనాధ పిల్లలకు అన్నదానం చేస్తున్న అభిమానులు?

బిగ్ బాస్( Bigg Boss ) సీజన్ సెవెన్ కార్యక్రమం చివరి దశకు చేరుకుంది.మరొక నాలుగు రోజులలో ఈ కార్యక్రమం పూర్తి కానుంది.

 Shivaji Fans Donate Food For Orphans To Make Him Bigg Boss Winner , Shivaji, Big-TeluguStop.com

అయితే ఈ కార్యక్రమానికి విజేత ఎవరు అనే విషయం గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శివాజీ( Shivaji ) టైటిల్ గెల్చుకోబోతున్నారు అంటూ వార్తలు రాగా పల్లవి ప్రశాంత్ అమర్ కూడా టైటిల్ రేసులో ఉన్నారు.

ఇక తమ అభిమాన కంటెస్టెంట్ కి ఓట్లు పడాలి అంటూ ఇప్పటికే హౌస్ లో ఉన్నటువంటి ఈ కంటెస్టెంట్ల టీం బయట చురుగ్గా పనిచేస్తున్నారు.ఇప్పటికే పల్లవి ప్రశాంత్( Pallavi prashanth ) టీమ్ తన గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి రైస్ ప్యాకెట్ అందజేస్తూ ప్రశాంత్ కే ఓటు వేయాలి అంటూ చెబుతున్నారంటూ వార్తలు వచ్చాయి.</br

ఇకపోతే శివాజీకి కూడా ఓట్లు వేసి తనని గెలిపించాలి అంటూ ఆయన అభిమానులు పెద్ద ఎత్తున అనాధ పిల్లలకు అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇలా అనాధ ఆశ్రమంలో ఉన్నటువంటి పిల్లలందరికీ శివాజీ అభిమానులు శివాజీ బిగ్ బాస్ విజేతగా( Bigg Boss Winner ) నిలవాలి అంటూ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.అయితే ఈ కార్యక్రమం ఎక్కడ జరిగింది అన్న విషయం గురించి క్లారిటీ లేకపోయిన ఇందుకు సంబంధించినటువంటి వీడియో అఫీషియల్ సోషల్ మీడియా ఖాతా ద్వారా బయటకు వచ్చింది.</br

శివాజీ గెలవాలంటే అభిమానులు తనపై ఉన్నటువంటి ప్రేమతో ఇలా అనాధాశ్రమంలో ( Orphans )పిల్లలకు భోజనం(Food Donate) పెట్టడం ఎంతో మంచి పని.శివాజీ గెలుస్తారా లేదా అన్న విషయం పక్కన పెడితే ఆయన పేరు మీదగా ఇలా ఎంతోమంది అనాధ పిల్లలు కడుపునిండా భోజనం చేశారు అంటూ ఆయన అభిమానులు చేసినటువంటి ఈ పనిపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇక శివాజీ మొదటి నుంచి కూడా టైటిల్ రేస్ లో ఉన్నారు అయితే చివరి వారాలలో ఈయన ఆటతీరు అలాగే వ్యవహార శైలి కూడా కాస్త ప్రేక్షకులకు విసుగు రావడంతో ఓటింగ్ లో కాస్త వెనుక పడ్డారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube