దక్షిణాఫ్రికా( South Africa ) పర్యటనలో భాగంగా నేడు భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ20 మ్యాచ్ సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా ఇవాళ రాత్రి 8:30 గంటలకు ప్రారంభం కానుంది.ఈ టీ20 సిరీస్ లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే.
రెండవ మ్యాచ్ కి కూడా వర్ష గండం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.మధ్యాహ్నం వర్షం పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
పిచ్ లో 60 శాతం తేమ ఉంది.వాతావరణమంతా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
టీ20 వరల్డ్ కప్ 2024 కు ముందు జరిగే ఈ సిరీస్ భారత జట్టుకు ఎంతో కీలకం.యువ ఆటగాలను పరిశీలించడానికి ఇది చక్కని వేదిక.ఈ సిరీస్ లో రాణిస్తే ప్రపంచ కప్ ఆడే జట్టులో చోటు దక్కుతుందని యువ ఆటగాళ్లంతా భావిస్తున్నారు.ఇటీవలే ఆస్ట్రేలియా ( Ravindra Jadeja )జట్టును భారత్ 4-1 తేడాతో చిత్తు చేసి సిరీస్ కైవసం చేసుకుంది.
ఇప్పుడు సౌత్ ఆఫ్రికా పై గెలిచి టీ20 సిరీస్ కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తోంది.
భారత జట్టుకు మరింత బలం చేరడం కోసం సీనియర్ ఆటగాళ్లయిన రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్ జట్టులోకి రానున్నారు.మ్యాచ్ జరిగే పిచ్ బ్యాటింగ్, బౌలింగ్ కు తటస్థంగా ఉంటుంది.ఈ సెయింట్ జార్క్ పార్క్ లో సౌత్ ఆఫ్రికా ఆడిన మూడు మ్యాచ్లలో రెండు విజయాలు సాధించింది.
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టు రెండుసార్లు గెలవగా.ఛేజింగ్ చేసిన జట్టు ఒకసారి గెలిచింది.
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య 2015 తరువాత నాలుగు టీ20 సిరీస్లు జరిగితే భారత్ రెండు సార్లు విజేతగా నిలిచింది.మరో రెండు సిరీస్లు డ్రాగా ముగిశాయి.2015 లో జరిగిన టీ20 సిరీస్ లో భారత్ పై దక్షిణాఫ్రికా విజయం సాధించింది.అప్పటినుంచి భారత్( India ) చేతిలో దక్షిణాఫ్రికా ఓడుతూ వస్తోంది.
ఈ సిరీస్ లో కూడా దక్షిణాఫ్రికా పై గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భారత గట్టి పట్టుదలతో ఉంది.