తుఫాను పై వైసీపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.ప్రభుత్వం వేగంగా సహాయక చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు.
ముందస్తు చర్యలతోనే ప్రాణ నష్టం వాటిల్లకుండా ఆస్తినష్టంతో బయటపడ్డామని మంత్రి అంబటి తెలిపారు.సీఎం జగన్ పట్ల చంద్రబాబు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందనే జగన్ వెళ్లలేదని స్పష్టం చేశారు.టీడీపీ హయాంలో తుఫాను నష్టపరిహారం కంటే ఇప్పుడు ఎక్కువే ఇస్తున్నామని పేర్కొన్నారు.అలాగే హెక్టారుకు రూ.17 వేలు నష్టపరిహారం ఇస్తున్నామని తెలిపారు.