తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ( BRS ) ని చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.అయితే ఎలక్షన్స్ ముగిసాక కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఏ ఒక్కరూ కూడా ఆలోచించలేదు.
కానీ మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనే విధంగా ప్రజలు కూడా మార్పు కోసం తమ ఓట్లు కాంగ్రెస్ కి వేశారు.అలా తెలంగాణలో మార్పు రావాలని చూస్తున్నారు ప్రజలు.
ఇదిలా ఉంటే ఈసారి తెలంగాణ ఎన్నికల్లో టిడిపి ( TDP ) కూడా పోటీ చేస్తుంది అని దాదాపు రెండు సంవత్సరాల నుండి తెలంగాణలో ఉన్న టిడిపి నేతలు చాలామంది తమ జేబులో ఉన్న డబ్బులు సైతం ఖర్చు చేసి టిడిపి పార్టీ ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తుంది అని భావించారు.అంతేకాదు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలోనే బాలకృష్ణ మేము తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం అని బల్లగుద్ది మరీ చెప్పారు.
కానీ రెండు రోజులకే ఆయన చెప్పిన మాటలు వెనక్కి తీసుకున్నట్లయింది.తెలంగాణ ( Telangana ) లో టిడిపి పోటీ చేయమని తేల్చి చెప్పారు.అయితే తెలంగాణలో టిడిపి పోటీ చేయకపోవడానికి ప్రధాన కారణం టిడిపి పోటీ చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి రాదు అని ఫలితంగా మళ్లీ బీఆర్ఎస్ పాలనే తెలంగాణలో ఉంటుందని భావించారు.దాంతో పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇస్తూ ఎన్నికల నుండి తప్పుకున్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే టిడిపి జెండాలు కూడా ఎగిరాయి.అంతేకాదు తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఆంధ్రాలో టిడిపి నాయకులు సంబరాలు చేసుకున్నారు.
ఇక ఇవి చూసి కాంగ్రెస్ ( Congress ) పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన టిడిపి పార్టీ నే ఇలా కాంగ్రెస్ గెలిస్తే పండగలు చేసుకోవడం ఏంటో విడ్డూరం అని అందరూ నవ్వుకున్నారు.ఇక టిడిపి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా టిడిపికి గత ఫలితాలే వస్తాయి అని చాలామంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇక ఇప్పటికే టిడిపి పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకుంది.అలాగే పరోక్షంగా కాంగ్రెస్ పార్టీతో కూడా దగ్గరగానే ఉంటుంది.
ఇక బిజెపి ( BJP )తో కూడా చేతులు కలిపి ఆంధ్రాలో అధికారంలోకి రావాలని చూసినప్పటికీ బీజేపీ పార్టీ మాత్రం కేవలం జనసేనతోనే మేము పొత్తు పెట్టుకుంటాం టిడిపి పార్టీతో మాకు అవసరం లేదు అన్నట్లుగా ప్రతిసారి మాటల తూటాలు పేల్చుతున్నారు.అయితే చంద్రబాబు కాంగ్రెస్ తో స్నేహం చేస్తే ఖచ్చితంగా ఫలితాలు తారుమారవుతాయని భావిస్తున్నారు.కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టిన టిడిపి పార్టీ తిరిగి కాంగ్రెస్తోనే చేతులు కలిపితే ప్రజలు వారికి తగిన బుద్ధి చెబుతారు అని కూడా రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.మరి చూడాలి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో చంద్రబాబు చేతులు కలుపుతారా లేదా అనేది.