గత ఏడాది శ్రీలంక( Sri Lanka ) తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవటం తెలిసిందే.సంక్షోభం కారణంగా దేశంలో ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు కూడా చేయడం జరిగింది.
దీంతో పరిస్థితి చేయి దాటి పోవడంతో ప్రభుత్వ పెద్దలు దేశం విడిచి కూడా పారిపోవడం జరిగింది.దీంతో శ్రీలంకలో ఆకలి కేకలు ఇంకా అనేక రకాల సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పాలు కావడం జరిగింది.
పరిస్థితి ఇలా ఉండగా ప్రస్తుతం శ్రీలంక పూర్తిగా చీకట్లోకి వెళ్ళిపోయింది.శనివారం సాయంత్రం ఐదున్నర గంటల నుంచి సాంకేతిక సమస్య తలెత్తడంతో… శ్రీలంక వ్యాప్తంగా విద్యుత్ నిలిచిపోయింది.
ప్రజలు తీవ్ర ఇకట్లపాలవుతున్నారు.

అత్యవసర సర్జరీలకు ఆసుపత్రులలో కరెంటు లేకపోవడంతో.అనేకమంది రోగులు ప్రాణాపాయాన్ని ఎదుర్కొంటున్నారు.శ్రీలంక వ్యాప్తంగా జనజీవనం స్తంభించింది.
ఈ క్రమంలో విద్యుత్ పునరుద్ధరణకు కృషి చేస్తున్నట్లు అధికారులు తెలియజేస్తున్న ప్రజలు మండిపడుతున్నారు.శ్రీలంక తీవ్ర ఆర్థిక వ్యవస్థ సంక్షోభం( Financial crisis ) కారణంగా.
ఇంధన రవాణాకు.డబ్బులు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది.
దీంతో రోజుకు 10 గంటల పాటు విద్యుత్ కోత విధిస్తున్నారు.ఇటీవల ఆ కోతల్ని 13 గంటలకు పెంచారు.
అయితే శనివారం దేశవ్యాప్తంగా విద్యుత్ అంతరాయం ఏర్పడటంతో ప్రజలు.ప్రభుత్వం పై అసహనం వ్యక్తం చేస్తున్నారు.







