తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న నటులు వాళ్ళకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతు ఉంటారు.ఇక ఇలాంటి క్రమం లోనే కొంతమంది నటులు హీరోలు గా చేసి ఆ తరువాత వాళ్ళకంటు మార్కెట్ అనేది డౌన్ అవ్వడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతారు.
ఇక ఇలాంటి నటులు ఇండస్ట్రీ లో చాలా మంది ఉన్నారు వాళ్లలో హీరో రాజశేఖర్ ఒకరు.ఈయన చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఆయన ఇప్పుడు నితిన్ హీరో గా వచ్చిన ఎక్స్ ట్రా ఆర్డినరీ అనే సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు.
అయినప్పటికీ ఈ సినిమా పెద్దగా సక్సెస్ సాధించకపోవడంతో ఆయన కెరియర్ అనేది చాలా వరకు ఇబ్బందుల్లో పడ్డట్టు గా తెలుస్తుంది…అయితే ఇప్పుడు రాజశేఖర్ నెక్స్ట్ సినిమాలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతాడా లేదా మళ్లి హీరోగా సినిమాలు చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.ఇక ఆయనకి ఫ్యూచర్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమా అవకాశాలు వస్తాయా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ఎందుకంటే ఈ సినిమా ప్లాప్ తో ఆయనకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పెద్దగా అవకాశాలు అనేవి రాకపోవచ్చు.అంటూ పలువురు సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు… పోయి పోయి రాజశేఖర్ ఈ ప్లాప్ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు అంటూ చాలామంది సినీ విమర్శకులు సైతం ఆయన విషయంలో సానుభూతిని చూపిస్తున్నారు.ఇక ఇప్పటికైనా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి సినిమాలను సెలెక్ట్ చేసుకొని చేయాలని ఆయన అభిమానులు కూడా ఆయనకి సలహాలను ఇస్తున్నారు…నిజానికి ఈయన చేసిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అవ్వడం తో ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు…
.