ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) ఎంజాయ్ చేస్తున్నటువంటి పీక్ కెరీర్ ని టాలీవుడ్ లో ఏ సీనియర్ హీరో కూడా ఎంజాయ్ చెయ్యడం లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.‘అఖండ’ సినిమాతో( Akhanda ) బాలయ్య బాబు టైం ప్రారంభం అయ్యింది.ఆ తర్వాత వెంటనే ‘వీర సింహా రెడ్డి’( Veerasimha Reddy ) చిత్రం తో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు.ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా ఆహా మీడియా లో ఆయన హోస్ట్ గా వ్యవహరించిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో కూడా పెద్ద హిట్ అయ్యింది.
యూత్ ఆడియన్స్ కి బాలయ్య బాబు ని బాగా దగ్గర చేసింది.ఈ షో తర్వాత బాలయ్య ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా దగ్గరయ్యాడు.అలా వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోతున్న బాలయ్య కి రీసెంట్ గా విడుదలైన ‘భగవంత్ కేసరి’( Bhagavanth Kesari ) కూడా పెద్ద హిట్ గా నిల్చింది.
ఇప్పుడు ఆయన డైరెక్టర్ బాబీ తో( Director Bobby ) ఒక సినిమా చేస్తున్నాడు.ఈ ఏడాది ప్రారంభం లో సంక్రాంతి కానుకగా మెగా స్టార్ చిరంజీవి తో ‘వాల్తేరు వీరయ్య’( Waltair Veerayya ) లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బాబీ ఎంత జోష్ మీద ఉన్నాడో మన అందరికీ తెలిసిందే.ఈ సినిమా తర్వాత వెంటనే బాలయ్య బాబు తో సినిమా ప్రారంభించడం తో ఈ ప్రాజెక్ట్ మీద కూడా మార్కెట్ లో క్రేజ్ ఏర్పడింది.
ఇవన్నీ పక్కన పెడితే బాలయ్య అతి త్వరలోనే సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ తో( Director Sukumar ) ఒక సినిమా చేయబోతున్నాడని ఒక టాక్ బలంగా వినిపిస్తుంది.పుష్ప చిత్రం తో( Pushpa ) పాన్ ఇండియా లెవెల్ లో 360 కోట్ల రూపాయిలను కొల్లగొట్టిన డైరెక్టర్ తో బాలయ్య సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో మన అందరికీ తెలిసిందే.
ఆ అంచనాలకు తగ్గట్టుగానే బాలయ్య కి ఒక పవర్ ఫుల్ రోల్ రాసాడట సుకుమార్.
ఈ చిత్రం ప్రారంభం అయ్యే ముందే బాలయ్య బాబు బోయపాటి శ్రీను తో ఒక సినిమా కమిట్ అయ్యాడు.ఈ చిత్రం వచ్చే ఏడాది లో ప్రారంభం అయ్యింది.ఈ సినిమా విడుదలైన తర్వాత బాలయ్య సుకుమార్ కాంబినేషన్ పట్టాలెక్కే ఛాన్స్ ఉండి.
ఎటు చూసుకున్న బాలయ్య బాబు కెరీర్ రాబొయ్యే రోజుల్లో అభిమానులు కూడా ఊహించని రేంజ్ లో ఉంటుంది అని మాత్రం చెప్పొచ్చు,చూడాలి మరి.