ఈసారి తెలంగాణలో ఎలాగైనా బిఆర్ఎస్ కు చెక్ పెట్టి తాము అధికారం సాధించాలని కాంగ్రెస్ నేతలు తెగ ఆరాటపడుతున్నారు.బిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అని మొదటి నుంచి హస్తంనేతలు చెబుతున్నప్పటికి గత ఆర్నెళ్ల ముందు వరకు ఆ పార్టీ పరిస్థితి నత్తనడకనే సాగింది.
పార్టీలో కూడా అంతర్గత కుమ్ములాటలు పెరిగి ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తూ వచ్చారు హస్తంనేతలు.కానీ కర్నాటక ఎన్నికల తరువాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది.
ఆ రాష్ట్ర ఎన్నికల్లో ఘనవిజయం లభించడంతో తెలంగాణలో కూడా హస్తంపార్టీకి ఊపిరివచ్చింది.
దాంతో అదే ఊపులో తెలంగాణలో కూడా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ వచ్చింది.సేమ్ అక్కడ సక్సస్ అయిన విన్నింగ్ స్ట్రాటజీని ఇక్కడ కూడా అప్లై చేసింది.కర్నాటక( Karnataka )లో ప్రకటించిన ఆరు గ్యారెంటీ హామీలను ఇక్కడ కూడా ప్రకటించి వాటినే ప్రధాన ఎజెండాగా ప్రజల్లోకి తీసుకుల్లింది.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇంటినీటికి 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, నిరుద్యోగ భృతి ఇలా కొన్ని రకాల హామీలను నొక్కి చెబుతూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేసింది కాంగ్రెస్.
అయితే ప్రస్తుతం కర్నాటకలో ఇవే హామీలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటి అమలు విషయంలో మాత్రం పూర్తిగా డీలా పడినట్లు తెలుస్తోంది.మొదట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పినప్పటికి ఇప్పుడు కొన్ని షరతుల మేర ఆ పథకాన్ని కాంగ్రెస్ అమలు చేస్తోందట.ఇలా హామీల అమలు విషయంలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు ఆ రాష్ట్రప్రజలను అసహనానికి గురి చేస్తున్నాట్లు వార్తలు వస్తున్నాయి.
దీంతో అక్కడ సరిగా అమలు కానీ ఆరు గ్యారెంటీ హామీలు తెలంగాణలో ఎంతమేర సక్సస్ అవుతాయనే డౌట్ చాలమందిలో ఉన్నట్లు తెలుస్తోంది.దీంతో విజయం కోసం ఆరు గ్యారెంటీలనే నమ్ముకున్న కాంగ్రెస్( Congress ) కు నిరాశ తప్పదా అనే సందేహాలు కూడా వ్యక్తమౌతున్నాయి.
మరి కాంగ్రెస్ ప్లాన్ హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో చూడాలి.