వైసీపీ మంత్రి జోగి రమేష్ కూతురు వివాహ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్..!!

వైసీపీ మంత్రి జోగి రమేష్( YCP Minister Jogi Ramesh ) కూతురు వివాహ వేడుక మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ వేడుకలో సీఎం జగన్ కూడా పాల్గొని నూతన వధూవరులు రేష్మా ప్రియాంక, వరుడు అమోఘ్ సతీష్ గుతేదర్ లను సీఎం జగన్( CM Jagan ) ఆశీర్వదించారు.వైసీపీ పార్టీలో సీఎం జగన్ కి అత్యంత నమ్మకమైన నాయకులలో జోగి రమేష్ ఒకరు.2019 ఎన్నికల సమయంలో పెడన నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది.2022 ఏప్రిల్ 11వ తారీఖున జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా గృహ నిర్మాణ శాఖ మంత్రిగా జోగి రమేష్ బాధ్యతలు చేపట్టడం జరిగింది.

 Cm Jagan Participated In Ycp Minister Jogi Ramesh Daughter Wedding Ceremony , Cm-TeluguStop.com

వైసీపీ పార్టీలో జోగి రమేష్ కీలక నేతగా రాణిస్తూ ఉంటారు.

ఈ క్రమంలో వైసీపీ( YCP ) ప్రభుత్వంపై చేసే విమర్శలకు ఆరోపణలకు తగిన రీతిలో మీడియా సమావేశాలు పెట్టి సరైన కౌంటర్లు ఇస్తుంటారు.ముఖ్యంగా సీఎం జగన్ పై ప్రత్యర్థులు ఎలాంటి విమర్శలు చేసిన వాటిని తిప్పి కొట్టడంలో సరైన కౌంటర్ ఇవ్వడంలో మంత్రి జోగి రమేష్ ఎప్పుడు ముందుంటారు.

ఈ క్రమంలో జోగి రమేష్ ఏకైక కుమార్తె వివాహానికి పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు.భారీగా హాజరు కావడం జరిగింది.ఈ సందర్భంగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆశీర్వదిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube