ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా సేవించే పానీయాల్లో కాఫీ ఒకటి.పిల్లల నుంచి పెద్దల వరకు కోట్లాది మంది కాఫీ ని అమితంగా ఇష్టపడుతుంటారు.
చాలా మంది కాఫీతోనే రోజును కూడా ప్రారంభిస్తుంటారు.చక్కటి రుచి, ఫ్లేవర్ ను కలిగి ఉండే కాఫీ ఒత్తిడి, అలసట, తలనొప్పి వంటి సమస్యలను క్షణాల్లో దూరం చేస్తుంది.
మైండ్‌ను ప్రశాంతంగా మారుస్తుంది.అయితే కాఫీ తో బరువు కూడా తగ్గొచ్చు.
అవును, మీరు విన్నది నిజమే.
అందులోనూ ఇప్పుడు చెప్పబోయే విధంగా కాఫీ ని కనుక తీసుకుంటే మీ బాన బొట్ట మాయం అవ్వాల్సిందే.
మరి ఇంకెందుకు ఆలస్యం కాఫీ ని ఎలా తీసుకుంటే బాన పొట్ట దూరం అవుతుందో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక గ్లాస్ జార్ ను లేదా గిన్నెను తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ఇన్స్టంట్ కాఫీ పౌడర్ వేసుకోవాలి.
ఆ తర్వాత అందులో ఒక కప్పు బాగా మరిగించిన వాటర్ ను పోయాలి.అనంతరం అందులో వన్ టేబుల్ స్పూన్ వర్జిన్ కోకనట్ ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి హ్యాండ్ బ్లెండర్ సహాయంతో మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బ్లెండ్ చేయాలి.
చివరగా అందులో వన్ టేబుల్ స్పూన్ తేనె ను మిక్స్ చేసి తాగేయడమే.

ఈ విధంగా కాఫీ ని తీసుకుంటే పొట్ట వద్ద పేరుకు పోయిన కొవ్వు మొత్తం కరిగి పోతుంది.దాంతో మీ బాన పొట్ట కేవలం కొద్ది రోజుల్లోనే నాజూగ్గా తయారవుతుంది.అలాగే ఈ విధంగా కాఫీని తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు.
అతి ఆకలి సమస్య దూరం అవుతుంది.మెదడు పని తీరు చురుగ్గా మారుతుంది.
ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది.