కాంగ్రెస్ పై కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.కర్ణాటకలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదని ఆరోపించారు.
కర్ణాటకలో ఐదు గ్యారంటీ పథకాలను కాంగ్రెస్ పక్కన పెట్టేసిందని యడియూరప్ప తెలిపారు.ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చి కాంగ్రెస్ చేతులు ఎత్తేసిందని విమర్శించారు.
కర్ణాటక ప్రజానీకాన్ని కాంగ్రెస్ మోసం చేసిందన్న ఆయన ఇప్పుడు అదే తరహాలో తెలంగాణలోనూ ప్రజలను మోసం చేయాలని చూస్తోందని తెలిపారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ హామీలను తెలంగాణ ప్రజలు నమ్మొద్దని సూచించారు.
తెలంగాణలో అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్న ఆయన బీజేపీని గెలిపించాలని కోరారు.