స్కిప్పింగ్ చేయడం వలన ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

ఆరోగ్యం మేలుగా ఉండడం కోసం వైద్య నిపుణులు ఎక్సైజ్ లు చెయ్యాలని చెబుతూ ఉంటారు.అందులో స్కిప్పింగ్( Skipping ) కూడా ఒకటి.

 Amazing Health Benefits Of Skipping,skipping,skipping Tips,full Body Workouts,ju-TeluguStop.com

స్కిప్పింగ్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అని ప్రతి ఒక్కరికి తెలిసిందే.కానీ ఇప్పటికి కూడా దాన్ని చాలా మంది రోజువారి వ్యాయామంలో చేర్చుకోవడం మర్చిపోతున్నారు.

ఇది కేవలం ఒకటి కాదు ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుంది.దీని గురించి అందరికీ పూర్తిగా తెలియదు.

ఇది చాలా ఖరీదైన ఫ్యాన్సీ యంత్రాలు అవసరం లేని వ్యాయామం.అయినప్పటికీ చాలామంది దీన్ని రోజువారి వ్యాయామంలో చేర్చుకోవడం లేదు.

దీనికి కావాల్సిందల్లా సరళమైన తేలికపాటి తాడు మాత్రమే.అలాగే కొద్దిగా స్థలం.

ఇక మరికొందరు ఏమో దీన్ని వినోదం కోసం కూడా చేస్తారు.

Telugu Benefits, Full Workouts, Tips-Telugu Health

కానీ దాన్ని సీరియస్ గా చేసి అందులో పరిపూర్ణంగా మారితే మాత్రం క్రిస్ క్రాస్( Criss Cross ), సైడ్స్ వింగ్, ఆల్టర్నేట్ ఫుట్ జంప్ మొదలైన అనేక మార్గం లో దీన్ని చేయవచ్చు.అయితే అధిక బరువుతో బాధపడేవారు ఈ స్కిప్పింగ్ చేయడం వలన చాలా ఉపయోగపడుతుంది.రోజు స్కిప్పింగ్ చేయడం వలన శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వు పూర్తిగా కరిగిపోయి సన్నగా మారిపోతారు.

ప్రతిరోజు ఒక గంట పాటు తాడు ఆట ఆడితే క్యాలరీలు ఖర్చవుతాయి.ఇక బరువు తగ్గాలనుకునే వారు స్కిప్పింగ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది.అయితే గంటపాటు స్కిప్పింగ్ చేస్తే దాదాపు 1600 క్యాలరీలు కరిగిపోతాయి.

Telugu Benefits, Full Workouts, Tips-Telugu Health

ఇక స్కిప్పింగ్ అనేది ఫుల్ బాడీ వర్క్ అవుట్( Full Body Workout ) అవ్వడం వలన ఇది బాడీను స్టెబిలైజ్ చేయడానికి అలాగే అబ్డోమెన్ మజిల్స్ ను వాడుతుంది.అంతేకాకుండా జంపింగ్( Jumping ) కోసం కాళ్లు వర్క్ చేస్తాయి.ఇక భుజాలు అలాగే చేతులు రోప్ ను టర్న్ చేయడానికి ఉపయోగపడతాయి.

ఇలా శరీరంలో ఉన్న అన్ని అవయవాలు ఒకేసారి పని చేయడం వలన కోఆర్డినేషన్ స్టామినా అలాగే ఫోకస్ పెరుగుతాయి.ఇక రెగ్యులర్ గా స్కిప్పింగ్ చేస్తే హ్యాండ్ తో ఐకో ఆర్డినేషన్ పెరుగుతుంది.

ఏ వ్యాయామం చేసే ముందు అయినా స్కిప్పింగ్ చేయడం వలన కండరాలను మూడు నుండి ఐదు నిమిషాలు వేడెక్కించవచ్చు.వీలైనంత ఎత్తుకు దూకడానికి ఇది గుండెను ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube