చరణ్ సాయిపల్లవి కాంబినేషన్ లో సినిమా.. నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ అంటూ?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) గురించి మనందరికీ తెలిసిందే.రామ్ చరణ్ గత ఏడాది విడుదల అయిన ఆర్ఆర్ఆర్ మూవీ తో( RRR ) గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

 Sai Pallavi In Ram Charan Rc16 Movie Details, Sai Pallavi, Rc16 Movie, Ram Chara-TeluguStop.com

ఇప్పుడు అదే ఊపుతో తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ సినిమాలో( Game Changer ) నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు.ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 50 శాతం షూటింగ్ పూర్తి అయ్యిందని సమాచారం.

దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమా షూటింగ్లో బాగా బిజీ బిజీగా ఉండడంతో ఈ గేమ్ ఛేంజర్ సినిమా ఆలస్యం అవుతోంది.దీంతో ప్రస్తుతం రామ్ చరణ్ తన 16వ సినిమాని( RC16 ) మొదలు పెట్టాలని చూస్తున్నారు.

అయితే రామ్ చరణ్ తన తదుపరి సినిమాను బుచ్చిబాబు( Buchibabu ) దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే.మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ ఈ సినిమాను నిర్మించబోతోంది.

Telugu Buchibabu, Game Changer, Ram Charan, Ramcharan, Rc, Sai Pallavi, Saipalla

స్పోర్ట్స్ డ్రామాగా( Sports Drama ) రూపొందనున్న ఈ సినిమాను జనవరి నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారు మూవీ మేకర్స్.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఫైనల్ చేసినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.మొదట ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఆ తర్వాత మృణాల్ ఠాకూర్ పేర్లు వినిపించాయి.ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో సాయి పల్లవిని( Sai Pallavi ) హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

Telugu Buchibabu, Game Changer, Ram Charan, Ramcharan, Rc, Sai Pallavi, Saipalla

ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది అభిమానులు పర్ఫెక్ట్ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఒకవేళ సాయి పల్లవి కనుక ఈ సినిమాలో నటిస్తే ఆమె తెలుగులో స్టార్ హీరో పక్కన నటించడం ఇదే మొదటి సినిమా అవుతుంది.ఇప్పటివరకు ఆమె వరుణ్ తేజ్ నాని శర్వానంద్ నాగచైతన్య రానా వంటి హీరోల పక్కన నటించి మెప్పించింది.ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాలి అంటే మూవీ మేకర్స్ స్పందించేంత వరకు వేచి చూడాల్సిందే మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube