మన దేశంలోని ప్రజలు ఏ పండుగ జరుపుకున్న బంతిపూల తోరణాలతో ఇంటిని ఎంతో అందంగా అలంకరిస్తారు.బంతిపూలకు మాత్రమే ఈ ప్రత్యేకత ఉంది.
అందానికి, ఆరోగ్యానికి మేలు చేసే బంతినీ మనకు ప్రకృతి ఇచ్చినా బహుమతిగా చెప్పవచ్చు.తెల్లవారుజామున సూర్యుడు ఉదయించగానే భూమిలోని చీకట్లు తొలగి వెలుగు రేఖలు అంతటా వ్యాపిస్తాయి.
అదే విధంగా బంతి పువ్వును చూడగానే మన మనసు తన బాధలను మరిచిపోయి సంతోషిస్తుంది.ఈ సారూప్యత వల్ల బంతి పువ్వును సూర్య భగవానుడికి చిహ్నంగా చెబుతున్నారు. గణేష్ చతుర్థి, నవరాత్రుల నుంచి దీపావళి వరకు ఈ పూలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
300 సంవత్సరాల క్రితం పోర్చుగీసు వారి రాకతో మెక్సికో నుంచి ఈ బంతి పూలు భారతదేశానికి చేరుకున్నాయి.చాలా అందంగా కనిపించే పసుపు, కుంకుమ రంగులో ఉండే ఈ పువ్వును అందరూ ఇష్టపడతారు.మన దేశంలోనీ రైతులు బంతిపూల సాగు పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు.
ఇది మతపరమైన ఆచారాల తో పాటు అనేక ఉత్పత్తుల తయారీలో కూడా ఉపయోగిస్తారు.సీజన్ ను బట్టి బంతి పువ్వును సాగు చేస్తారు.
ఇది ఏప్రిల్, మే నెలలో సాగు ప్రారంభిస్తే ఆగస్టు, సెప్టెంబర్ లో చలికాలం ప్రారంభానికి ముందు పంట చేతికి వస్తుంది.దేవతల గురువు బృహస్పతి నీ బంతి పువ్వులతో పూజిస్తే జ్ఞానం పెరుగుతుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు.
అలాగే పసుపు కుంకుమను కలిపినట్టుగా ఉండే ఈ రంగు త్యాగానికి ప్రసిద్ధి చెందింది.మరో వైపు ఇది అగ్ని వంటి ఉగ్రమైన వ్యక్తిత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది.అలాగే బంతి పువ్వులో ఉండే యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలు రక్త కణాలను ఉత్పత్తి చేసి చర్మాన్ని మృదువుగా ఆరోగ్యంగా మార్చగలవు.బంతి పువ్వులు వాపునే కాకుండా అలసటను తగ్గించడానికి కషాయంలా కూడా ఉపయోగపడతాయి.
బంతి పువ్వు పొడి ముడతలు పడిన చర్మాన్ని మృదువుగా చేయడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.బంతిపూలు సహజ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి.ఇవి కాలుష్యం నుంచి చర్మాన్ని రక్షిస్తాయి.
DEVOTIONAL