ముంబైలో కొత్త ఇల్లు కొనుగోలు చేసిన లైగర్ బ్యూటీ అనన్య పాండే.. ఎన్ని రూ.కోట్లంటే?

బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో అనన్య పాండే( Ananya Panday ) ఒకరు కాగా ఈ బ్యూటీ నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధించలేదు.తెలుగులో ఈ బ్యూటీ లైగర్ సినిమాలో నటించగా ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

 Ananya Panday Mumabi Luxury Home Details Here Goes Viral In Social Media,ananya-TeluguStop.com

ఈ సినిమాలో అనన్య నటనకు సైతం నెగిటివ్ మర్కులు పడ్డాయి.అయితే ధన్ తేరాస్( Dhanteras ) సందర్భంగా అనన్య పాండే ముంబైలో కొత్త ఇల్లును కొనుగోలు చేశారు.

అనన్య పాండే తన ఇన్ స్టాగ్రమ్ ఖాతా ద్వారా కొత్త ఇంటికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఈ ఇల్లు నా కొత్త ఇల్లు అని మీ ప్రేమాభిమానాలు నాపై ఉండాలని అందరికీ దంతేరాస్ శుభాకాంక్షలు అని చెప్పుకొచ్చారు.

ఈ ఇంటి కోసం అనన్య పాండే ఏకంగా ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ప్రచారం జరుగుతోంది.స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో ఈ బ్యూటీ సినీ కెరీర్ మొదలైంది.ప్రస్తుతం మూడు హిందీ సినిమాలలో నటిస్తున్న ఈ బ్యూటీ ఒక్కో సినిమాకు 7 నుంచి 8 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్( Ananya Panday Remuneration ) ను అందుకుంటున్నారని సమాచారం అందుతోంది.

వెబ్ సిరీస్ లు, ఓటీటీ సినిమాలలో సైతం నటిస్తున్న ఈ బ్యూటీ రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటాననే నమ్మకాన్ని కలిగి ఉన్నారు.అనన్య పాండే సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.

ఇన్ స్టాగ్రామ్ లో ఈ బ్యూటీకి ఏకంగా 25 మిలియన్ల ఫాలోవర్లు( Ananya Panday Instagram ) ఉన్నారంటే ఈ బ్యూటీకి క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.అనన్య పాండే సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుని ముందడుగులు వేస్తే ఆమెకు క్రేజ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది.అనన్య కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube