ఖలిస్తాన్ ఉగ్రవాదులు హర్దీప్ సింగ్ నిజ్జర్, సుఖా దునేకా హత్యలతో కెనడాలో( Canada ) పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా వున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ప్రమేయం వుందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Justin Trudeau ) చేసిన వ్యాఖ్యలు ఇరుదేశాల్లో పెను దుమారం రేపాయి.
తాజాగా కెనడాలో వ్యవస్థీకృత నేరాలు నిర్వహించే గ్యాంగ్‌ల్లో కీలక వ్యక్తిగా భావించే భారత సంతతికి చెందిన సిక్కు వ్యక్తి, అతని 11 ఏళ్ల కొడుకును ప్రత్యర్ధి ముఠా కాల్చి చంపింది.
హర్‌ప్రీత్ సింగ్ ఉప్పల్ (41),( Harpreet Singh Uppal ) అతని కుమారుడిపై గురువారం మధ్యాహ్నం ఓ గ్యాస్ స్టేషన్ వెలుపల పట్టపగలు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని ఎడ్మంటన్ పోలీస్ సర్వీస్ యాక్టింగ్ సూపరింటెండెంట్ కోలిన్ డెర్క్‌సెన్( Colin Derksen ) మీడియాకు తెలిపారు.
ఘటన సమయంలో ఉప్పల్ కారులోనే వున్న మరో బాలుడు ఎలాంటి గాయాలు లేకుండా క్షేమంగా బయటపడ్డాడు.అయితే పోస్ట్‌మార్టం ఇంకా పెండింగ్‌లో వున్నందున పోలీసులు బాలుడి పేరును వెల్లడించలేదు.
శుక్రవారం ఉదయం వరకు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఎవ్వరినీ అరెస్ట్ చేయలేదు, అనుమానితులను గుర్తించలేదు.
ఎడ్మంటన్( Edmonton ) వ్యవస్థీకృత నేరాల్లో ఉప్పల్‌ను కీలక వ్యక్తిగా పేర్కొన్నారు డెర్క్‌సెన్.అయితే మృతుడు ఏవైనా నిర్ధిష్ట గ్రూపులతో అనుబంధంగా వున్నారా అని చెప్పడానికి డెర్క్‌సెన్ నిరాకరించారు. కొకైన్ అక్రమ రవాణాతో పాటు బాడీ ఆర్మర్‌లను కలిగి వుండటం వంటి అభియోగాలను ఉప్పల్ ఎదుర్కొంటున్నట్లు కోలిన్ చెప్పారు.
ఈ కేసుకు సంబంధించి 2024 ఏప్రిల్‌లో విచారణ ప్రారంభం కావాల్సి వుందన్నారు.మార్చి 2021లో ఆయుధంతో దాడి చేయడం, అనధికారికంగా తుపాకీని కలిగి వుండటం కూడా ఉప్పల్‌పై మోపగా.
ఈ ఏడాది ఫిబ్రవరిలో కోర్ట్ ఆ ప్రక్రియలపై స్టే విధించింది.ఉప్పల్ హత్య యూఎన్ గ్యాంగ్,( UN Gang ) బీకే గ్యాంగ్‌ల( BK Gang ) మధ్య ఆధిపత్య పోరు కారణంగా జరిగి వుండొచ్చని భావిస్తున్నారు.
మరోవైపు.దేశవ్యాప్తంగా గ్యాంగ్‌స్టర్‌ల హత్యలు కెనడా పోలీసులను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.ఉప్పల్ హత్యకు ముందురోజు బీసీ యూఎన్ గ్యాంగ్‌కు చెందిన పర్మ్‌వీర్ చాహిల్‌ను( Parmvir Chahil ) టొరంటోలో కాల్చి చంపారు.ఈ హత్యలకు పరస్పరం సంబంధం వుండే అవకాశం వుందని మీడియాలో కథనాలు వస్తున్నాయి.
కాల్పులకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశామని, డిటెక్టివ్‌లు దర్యాప్తు ప్రారంభించారని పోలీసులు తెలిపారు.