'సలార్' చిత్రం లో 'పుష్ప రాజ్'..ఫ్యాన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్!

ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాలలో మన టాలీవుడ్( Tollywood ) రేంజ్ ని మరింత పెంచే సత్తా ఉన్న చిత్రాలు ఏమిటి అని అడిగితే మన అందరికి గుర్తుకు వచ్చే పేర్లు ‘సలార్’ మరియు ‘పుష్ప : ది రూల్’.కేజీఎఫ్ సిరీస్ లాంటి బాక్స్ ఆఫీస్ అద్భుతం తర్వాత ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో చేస్తున్న చిత్రం కావడం తో ఈ మూవీ పై అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

 'pushpa Raj' In The Movie 'salar' Mind-blocking News For Fans , Tollywood, Push-TeluguStop.com

బాలీవుడ్ లో ఈ ఏడాది రెండు సార్లు వెయ్యి కోట్ల రూపాయిలు కొల్లగొట్టిన షారుఖ్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ కూడా ‘సలార్’( Salar ) చిత్రం తో పోటీ కి దిగాలంటే బయపడుతున్నాడంటే సలార్ రేంజ్ ఎలాంటిదో అందరూ అర్థం చేసుకోవచ్చు.ఈ సినిమా డిసెంబర్ 22 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది .‘సలార్’ తర్వాత మన టాలీవుడ్ స్థాయి ని మరింత పెంచగలిగే సత్తా ఉన్న చిత్రం ‘పుష్ప : ది రూల్’.

Telugu Allu Arjun, Bollywood, National Award, Prabhas, Pushpa Raj, Salar, Tollyw

మొదటి భాగం పుష్ప దేశ వ్యాప్తంగా అన్నీ ప్రాంతాలలో దుమ్ము లేపేసింది.కలెక్షన్స్ పరంగా మాత్రమే కాకుండా, అల్లు అర్జున్( Allu Arjun ) క్రేజ్ ని కూడా అమాంతం పెంచేసింది ఈ చిత్రం.ఈ సినిమా ప్రభావం కారణంగా అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు( National Award ) కూడా దక్కింది.

అలాంటి బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ కావడం తో ఈ మూవీ పై అంచనాలు భారీ గా పెరిగిపోయాయి.ముఖ్యంగా గ్లిమ్స్ వీడియో కి హిందీ లో సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.

సుమారుగా 80 మిలియన్ వ్యూస్ వచ్చాయంటే ఈ సినిమాకి బాలీవుడ్( Bollywood ) లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.ఆగస్టు 15 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమా కి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది.

Telugu Allu Arjun, Bollywood, National Award, Prabhas, Pushpa Raj, Salar, Tollyw

అల్లు అర్జున్ పై పలు కీలకమైన సన్నివేశాలు మరియు సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు.మరో పక్క అదే రామోజీ ఫిలిం సిటీ లో ప్రభాస్ ( Prabhas )సలార్ చిత్రం షూటింగ్ జరుగుతుంది.ప్రస్తుతం ఐటెం సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు.

నేడు ప్రభాస్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.ప్రభాస్ షూటింగ్ కి వచ్చాడు అనే విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ వెంటనే సలార్ మూవీ స్పాట్ కి వాలిపోయాడట.

కాసేపు ప్రభాస్ తో సరదాగా గడిపి, నాలుగు కబుర్లు చెప్పుకొని , కొన్ని షాట్స్ చూసి అక్కడి నుండి వెళ్ళాడట అల్లు అర్జున్.త్వరలోనే సలార్ సెట్స్ లో వీళ్లిద్దరు కలిసి దిగిన ఫోటోలను విడుదల చేయబోతుంది మూవీ టీం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube