ఎన్నికల ప్రచారం లో కేటీఆర్ కి ప్రమాదం.. ప్రచార రథం కుప్పకూలిన వీడియో వైరల్!

తెలంగాణ ఎన్నికలకు సరిగ్గా మరో 20 రోజులు ఉన్నాయి.రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు నామినేషన్స్ పర్వం లో బిజీ గా ఉన్నారు.

 Telangana Minister Ktr Falls From Vehicle On Election Rally Details, Telangana E-TeluguStop.com

ఎన్నికల ప్రచారం లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు.ఇక బీఆర్ఎస్ పార్టీ( BRS ) తరుపున ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) ఏ రేంజ్ లో ఎన్నికల ప్రచారం చేస్తున్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం.ఇక ఆయన తనయుడు కేటీఆర్( Minister KTR ) కూడా అదే తరహాలో ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు.119 స్థానాల్లో ప్రతీ స్థానం లోను అసెంబ్లీ అభ్యర్డ్ల తరుపున ఆయన ప్రచారం లో క్షణంగా తీరిక లేకుండా గడుపుతున్నాడు.అయితే ఈరోజు ఆయన కొండగల్ ప్రాంతం లో( Kodangal ) ఎన్నికల ప్రచారం ప్రారంభించాడు.భారీ ఎత్తున పోలీసుల బందోబస్తు నడుమ కేటీఆర్ ఎన్నికల ప్రచారం జరిగింది.

అడుగడుగునా ఆయన జనాలు బ్రహ్మరథం పట్టారు.దీనికి సంబంధించిన వీడియో లు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

Telugu Brs, Chariot, Ktr, Telangana, Vehicle-Telugu Political News

ఈ వీడియోస్ తో పాటుగా మరో వీడియో కూడా తెగ వైరల్ అయ్యింది.ప్రచార రథం పైన కేటీఆర్ తో పాటుగా పలువురు ముఖ్య నాయకులూ మరియు కొండగల్ నియోజకవర్గం ఎమ్యెల్యే నిల్చొని వెళ్తూ ఉన్నారు.అయితే అకస్మాత్తుగా వాహనం పైన బారికేడు కుప్పకూలిపోవడం తో కేటీఆర్( KTR ) కూడా కుప్పకూలిపోయాడు.ఇక ఎమ్యెల్యే అభ్యర్థి( MLA Candidate ) అయితే వాహనం పై నుండి క్రింద పడిపోయాడు.

కేటీఆర్ కి స్వల్ప గాయాలు అయ్యాయి.ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన పెను ప్రమాదం నుండి తప్పించుకున్నాడు అనే చెప్పాలి.

డ్రైవర్ పైన బారికేడు కూలిపోయింది అనే విషయం తెలుసుకొని వెంటనే బండిని ఆపేసాడు కాబట్టి సరిపోయింది.లేకపోతే కేటీఆర్ తో పాటుగా, పైన నిల్చున్న అందరి ప్రాణాలు రిస్క్ లో పడేవి.

ఈ ప్రమాదం కి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.ఈ వీడియో ని చూసి బీఆర్ఎస్ పార్టీ అభిమానులు కంగారు పడుతున్నారు.

Telugu Brs, Chariot, Ktr, Telangana, Vehicle-Telugu Political News

ఏ ప్రమాదం జరగలేదు కాబట్టి సరిపోయింది, ఒకవేళ జరిగి ఉంటే అనర్ధం జరిగిపోయేది.డ్రైవర్ ముందుగా ఇవన్నీ చూసుకోవాలి, లేకపోతే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.అంతే కాకుండా కెపాసిటీ కి మించి బండి పైన జనాలు ఉండడం వల్ల కూడా ఈ ప్రమాదానికి కారణం అయ్యినట్టుగా చెప్తున్నారు.అనుకోని ఈ సంఘటన కారణం గా ఈరోజు జరగాల్సిన ఎన్నికల ప్రచారం( Elections Campaign ) ఆగిపోయింది.

ఇక ఎమ్యెల్యే అభ్యర్థికి మాత్రం బాగా దెబ్బలు తగిలాయి.పైన నుండి పూర్తి క్రిందకి పడిపోవడం వల్ల అతను కాళ్లకు దెబ్బలు తాకినట్టు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube