తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్..: మంత్రి కేటీఆర్

హైదరాబాద్ లో పారిశ్రామిక వేత్తలతో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తొలి రోజుల్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నామని తెలిపారు.

 Telangana Number One In Per Capita Income..: Minister Ktr-TeluguStop.com

ఉద్యమ పార్టీకి పాలన చేతనైతదా అని గతంలో ప్రశ్నించారన్న విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.తక్కువ సమయంలోనే విజయవంతమైన పాలన అందించామన్నారు.

టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలకు త్వరగా అనుమతులు ఇస్తున్నామని పేర్కొన్నారు.గతంలో పది గంటలు కరెంట్ పోయినా అడిగేవారు కాదని చెప్పారు.

ఇప్పుడు పది నిమిషాలు కరెంట్ పోతే విమర్శిస్తున్నారన్నారు.డీకే శివకుమార్ కర్ణాటకలో ఐదు గంటలు కరెంట్ ఇస్తున్నామని చెబుతున్నారని తెలిపారు.

పవర్ హాలిడే ఉంటే పరిశ్రమలు ఎలా నడుస్తాయని ప్రశ్నించారు.తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్ గా ఉందని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube