తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్..: మంత్రి కేటీఆర్

హైదరాబాద్ లో పారిశ్రామిక వేత్తలతో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తొలి రోజుల్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నామని తెలిపారు.

ఉద్యమ పార్టీకి పాలన చేతనైతదా అని గతంలో ప్రశ్నించారన్న విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.

తక్కువ సమయంలోనే విజయవంతమైన పాలన అందించామన్నారు.టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలకు త్వరగా అనుమతులు ఇస్తున్నామని పేర్కొన్నారు.

గతంలో పది గంటలు కరెంట్ పోయినా అడిగేవారు కాదని చెప్పారు.ఇప్పుడు పది నిమిషాలు కరెంట్ పోతే విమర్శిస్తున్నారన్నారు.

డీకే శివకుమార్ కర్ణాటకలో ఐదు గంటలు కరెంట్ ఇస్తున్నామని చెబుతున్నారని తెలిపారు.పవర్ హాలిడే ఉంటే పరిశ్రమలు ఎలా నడుస్తాయని ప్రశ్నించారు.

తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్ గా ఉందని వెల్లడించారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి16, గురువారం 2025