.జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం రెండు రాష్ట్రాలపై సమానంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.ఇటు ఏపీలో టీడీపీ తో కలిసి నిర్వహించే కార్యకలాపాల పైన దృష్టి సారిస్తూనే అటు తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేయడం పై దృష్టి పెడుతున్నారు.ఇప్పటికే తెలంగాణలో 32 స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించిన పవన్ ఇప్పుడు ఆ విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
ఎందుకంటే జనసేనతో దోస్తీ కోసం బీజేపీ ప్రయత్నిస్తుండడంతో పవన్ కూడా సుముఖంగా ఉన్నారు.ఇప్పటికే సీట్ల కేటాయింపులో కూడా తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం అటు ఏపీలోనూ ఇటు తెలంగాణలోనూ పవన్ వైఖరే హాట్ టాపిక్ గా మారింది.ఎందుకంటే ఏపీలో టీడీపీతో పొత్తులో ఉన్న పవన్.ఎన్డీయేలో తాము భాగమే అని గతంలోనే స్పష్టం చేశారు.కానీ ఏపీ బీజేపీతో మాత్రం కలిసి ఇంతవరకు ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించలేదు.కానీ తెలంగాణ బీజేపీతో( Telangana BJP ) మాత్రం కలిసి నడిచేందుకు సుముఖత చూపిస్తున్నారు.దీంతో అసలు బీజేపీ విషయంలో పవన్ ఎలాంటి వ్యూహంతో ఉన్నారనేది అర్థం కానీ పరిస్థితిగా మారింది.
ఏపీలో టీడీపీకి దగ్గరగా ఉంటున్న పవన్.బీజేపీని మాత్రం పట్టించుకోవడం లేదు.
తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు.దీంతో పవన్ ఒక అవకాశవాది అనే విమర్శలు ప్రత్యర్థి పార్టీ నేతల నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి.అయితే పవన్ వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నారని, ఆయన ప్రణాళికలు జనసేన పార్టీని బలపరిచేలా ఉన్నాయనేది ఆ పార్టీవర్గం నుంచి వినిపిస్తున్న మాట.అయితే తెలంగాణలో టీడీపీ ఎన్నికల రేస్ నుంచి తప్పుకోవడంతో ఆ పార్టీ జనసేన( Janasena )కు పరోక్షంగా మద్దతు పలుకుతుందా లేదా ఏపీ వరకే జనసేన దోస్తీని కొనసాగిస్తుందా అనేది కూడా ప్రశ్నార్థకమే.మొత్తానికి అటు ఏపీలోనూ ఇటు తెలంగాణలోనూ పవన్ వ్యూహాలు ఎవరికి అంతు చిక్కడం లేదని రాజకీయ అతివాదులు చెబుతున్నారు.