శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి షుగర్ అదుపులో ఉండాలంటే.. వీటిని ఇలా ఉపయోగించాల్సిందే..!

ప్రస్తుత సమాజంలో ప్రజలకు ఆరోగ్యం పై కాస్త శ్రద్ధ పెరిగింది అని కచ్చితంగా చెప్పవచ్చు.ప్రతి ఒక్కరూ మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తినడానికి ఇష్టపడుతున్నారు.

 To Increase Immunity In The Body And Keep Sugar Under Control.. These Should Be-TeluguStop.com

ఈ ప్రయత్నాలలో భాగంగా చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకుంటూ ఉన్నారు.ఈ రోజు చిరుధాన్యాలలో ఒకటైన అరికెల ( Arikelu )గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే తీపి, వగరు, చేదు రుచి కలిగిన అరికెలలో యాంటీ ఆక్సిడెంట్లు,( Antioxidants ) ఫైబర్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి.అలాగే అరికలలో ఫైబర్ సమృద్ధిగా ఉండడం వల్ల జీర్ణ సమస్యలు, గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు ఏమి రాకుండా చేస్తుంది.

Telugu Anemic Problem, Arikelu, Flow, Diabetes, Tips, Immunity-Telugu Health

అలాగే డయాబెటిస్( Diabetes ) బాధపడుతున్న వారికి కూడా ఇవి ఎంతో మంచిది.అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.డయాబెటిస్ ఉన్న వారిలో వచ్చే నీరసన్ని కూడా ఇది తగ్గిస్తుంది.ఈ మధ్య కాలంలో చాలా మంది లో ఎక్కువగా రక్తహీనత సమస్య కనబడుతుంది.ఇంకా చెప్పాలంటే అరికలను ఆహారంలో భాగం చేసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య( Anemic problem ) తగ్గడమే కాకుండా రక్తం శుద్ధి కూడా అవుతుంది.అంతే కాకుండా అధిక బరువు( Overweight ),అలాగే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరగడమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ ని కూడా కరిగిస్తుంది.

దీన్ని తీసుకోవడం వల్ల కడుపు నిండుగా ఉన్న భావన ఎక్కువసేపు ఉండి త్వరగా ఆకలి కూడా వేయదు.అలాగే తినాలని కోరిక కూడా తగ్గిపోతుంది.

Telugu Anemic Problem, Arikelu, Flow, Diabetes, Tips, Immunity-Telugu Health

ఇంకా చెప్పాలంటే ఎముకలు, కండరాలు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి.శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.ముఖ్యంగా చెప్పాలంటే నిద్ర లేమి సమస్య కూడా తగ్గిపోతుంది.కంటి నరాలు బలంగా ఉండేలా చేసి కంటి చూపు మెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.అలాగే రక్త పోటు( Blood flow ) నియంత్రణలో ఉండి రక్త ప్రవాహం కూడా బాగా జరిగి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube