యూట్యూబ్ లో ఈ కొత్త ఫీచర్లను కనిపెట్టారా?

యూట్యూబ్ అంటే ఏమిటో తెలియని జనాలు ఇక్కడ దాదాపుగా వుండరు.అవును, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇపుడు యూట్యూబ్( Youtube ) వాడుతున్నారు.

 Check Out These New Features For Youtube Users Details, Youtube Video, Sharing P-TeluguStop.com

అదేవిధంగా వ్యూయర్స్ ఎంతమంది ఉన్నారో, అందులో ఇంచుమించు సగం మంది యూట్యూబ్ క్రియేటర్స్ కూడా వున్నారు.అందుకే ఆ యాప్ ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్స్‌తో దూసుకుపోతూ వుంటుంది.అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన అప్‌డేట్స్‌ ఒక్కసారి చూద్దాము.

ఫాస్ట్ ఫార్వర్డ్ వీడియో స్పీడ్:

మీరు వీడియో ప్లేయర్ మీద 2 సార్లు ట్యాప్ చేస్తే వీడియో 10 సెకన్లు ముందుకు వెళ్తుంది.ఈ ఫీచర్ వెబ్, ట్యాబ్లెట్స్, మొబైల్స్‌లో అందుబాటులో కలదు.దీన్ని ప్రతి వీడియోకి రెండు సార్లు వాడొచ్చు.

యూట్యాబ్:

యూట్యాబ్ అంటే ఏమిటంటే… లైబ్రరీ ట్యాబ్, అకౌంట్ పేజ్‌ను కలిపి, అంబ్రెల్లా ఆప్షన్‌లో పెట్టారు.అందుకని దానిని యూట్యాబ్( Youtab ) అంటున్నాము.

ఈ సెక్షన్‌లో ఇంతకుముందు చూసిన వీడియోలు, ప్లే లిస్ట్‌లు, డౌన్‌లోడ్స్‌, పర్చేజ్లు, అకౌంట్ రిలేటెడ్ సెట్టింగ్స్, ఛానెల్ ఇన్ఫర్మేషన్ వంటివి పొందుపరచి ఉంటాయి.

Telugu Fast Forward, Platm, Search, Youtab, Youtube-Technology Telugu

వాయిస్ సెర్చ్:

ఇకనుండి యూట్యూబ్లో ఏవైనా వీడియోలు చూడాలంటే సెర్చ్ చేయడానికి టైప్ చేయాల్సిన పనిలేదు.అవును, సాంగ్ ప్లే చేసినా, పాడినా, హమ్ చేసినా ఏ.ఐ.ద్వారా( AI ) సౌండ్ని మ్యాచ్ చేసి రిజల్ట్‌లో మీకు చూపిస్తుంది.తద్వారా మీకు నచ్చిన వీడియోలు ఎంచక్కా చూడవచ్చును.

Telugu Fast Forward, Platm, Search, Youtab, Youtube-Technology Telugu

యానిమేటెడ్ బటన్స్:

యూట్యూబ్ క్రియేటర్ వ్యూయర్స్‌కు లైక్, సబ్‌స్క్రైబ్ వంటివి చేసినపుడు, అదేవిధంగా వీడియో ప్లే అయ్యేటప్పుడు అదే సింక్లో బటన్స్ పైన ఇవి కనిపిస్తాయి.వాటిని ట్యాప్ చేయగానే మెరుపులు కనిపిస్తాయి.అలాగే టాప్ కామెంట్స్ ఆటోమెటిక్గా రొటేట్ అవుతూ వుంటుంది.ఇది కూడా ఏమధ్యనే వచ్చిన అప్డేట్.కావున ఒకసారి ఈ ఫీచర్లు వున్నాయో, లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి.లేదంటే మీ యూట్యూబ్ యాప్ అప్డేట్ అవ్వలేదని అర్ధం.

తరువాత అప్డేట్ చేసుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube