స్టార్ హీరో రామ్ చరణ్ కూతురు ఫోటో ఇదేనంటూ ఫోటో వైరల్.. అసలేం జరిగిందంటే?

రామ్ చరణ్ ఉపాసనల కూతురు క్లీంకార కొణిదెల( Klin Kaara ) ఫోటోను విడుదల చేయాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.క్లీంకార పుట్టి నాలుగు నెలలు కావడంతో కనీసం ఒక్క ఫోటో అయినా రిలీజ్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

 Ram Charan Daughter Photo Become Photo Goes Viral In Social Media , Klin Kaara-TeluguStop.com

అయితే అధికారికంగా ఇప్పటివరకు క్లీంకార ఫోటోలేవీ రిలీజ్ కాకపోవడంతో కొందరు ఫ్యాన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో క్లీంకార ఫోటోలను క్రియేట్ చేసి రిలీజ్ చేస్తున్నారు.

వైరల్ అవుతున్న ఫోటోలలో రామ్ చరణ్( Ram Charan ) కూతుర్ ముద్దుగా ఉండటంతో కొంతమంది ఆ ఫోటోలే నిజమైన ఫోటోలు అని భావించి ఆ ఫోటోలను నెట్టింట వైరల్ అవుతున్నాయి.రామ్ చరణ్ కూతురు ఫోటోలు ఇవేనంటూ కొన్ని ఫేక్ ఫోటోలు ఒరిజినల్ ఫోటోలలా నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.రామ్ చరణ్ దంపతులు అధికారికంగా ఒక్క ఫోటో అయినా రిలీజ్ చేసి ఈ గందరగోళానికి చెక్ పెట్టాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు

రామ్ చరణ్ కెరీర్ విషయానికి వస్తే గేమ్ ఛేంజర్( Game Changer ) సినిమా షూట్ మొదలై చాలా రోజులైనా ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో ఎవరికీ క్లారిటీ రాలేదు.చరణ్ అభిమానులు సైతం ఈ సినిమా విషయంలో నిరాశ చెందుతున్నారు.రామ్ చరణ్ కెరీర్ ను శంకర్ ప్రమాదంలోకి నెట్టారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

రామ్ చరణ్ కు జోడీగా ఈ సినిమాలో కియారా అద్వానీ నటిస్తున్నారు.ఈ సినిమాలో మరో హీరోయిన్ గా అంజలి నటిస్తున్నారు.ఈ సినిమా వల్ల దిల్ రాజుపై వడ్డీల భారం పెరుగుతోందని తెలుస్తోంది.వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతుందో లేదో చూడాల్సి ఉంది.

చరణ్ తర్వాత సినిమాలు అయినా సరైన సమయంలో షూట్ ను పూర్తి చేసుకుని థియేటర్లలో విడుదలవుతాయో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube