అంతర్జాతీయ క్రికెట్లో మ్యాచ్ మధ్యలో ఆగడం, మ్యాచ్ ప్రారంభం కాకుండానే రద్దు అవడం సాధారణంగా వర్షం అంతరాయం( Rain ) కలిగించడం వల్లే జరుగుతుందని అందరికీ తెలిసిందే.కానీ కొన్ని సందర్భాల్లో వర్షం కారణంగా కాకుండా మిగతా కారణాల వల్ల కూడా మ్యాచ్లు ఆగడం, రద్దు అవడం జరిగింది.
అయితే అంపైర్లు మ్యాచులు రద్దు చేయకుండా ఎంతవరకు వీలైతే అంతవరకు ఆడించే ప్రయత్నం చేసిన కూడా వాతావరణ పరిస్థితుల కారణంగా మ్యాచ్ ఆపాల్సి వస్తుంది.
తాజాగా ధర్మశాల వేదికగా జరిగిన న్యూజిలాండ్-భారత్ మ్యాచ్( NZ vs Ind ) రెండో ఇన్నింగ్స్ ప్రారంభం అయ్యాక పొగ మంచు( Fog ) కారణంగా మ్యాచ్ రద్దు అయ్యే పరిస్థితి ఏర్పడింది.
అంపైర్లు కాసేపు మ్యాచ్ ను ఆపేసారు.స్టేడియంలో కూర్చున్న ప్రేక్షకుల్లో మ్యాచ్ జరుగుతుందా లేదంటే రద్దు అవుతుందా అనే టెన్షన్ నెలకొంది.కానీ అంపైర్లు కాసేపటి తరువాత మ్యాచ్ ను సజావుగా నిర్వహించడంతో ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇలాంటి వింత కారణాల వల్ల గతంలో కూడా అంతర్జాతీయ మ్యాచులకు అంతరాయం కలిగింది.అవి ఏమిటో చూద్దాం.1980లో భారత్-ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ సూర్యగ్రహణం( Solar Eclipse ) కారణంగా రద్దయింది.2008లో సౌత్ ఆఫ్రికా- శ్రీలంక మధ్య వన్డే మ్యాచ్ తేనెటీగల కారణంగా( Honey Bees ) తాత్కాలికంగా నిలిచిపోయింది.2017-18 రంజీ సీజన్ లో ఒక వ్యక్తి కారును( Car ) తీసుకొని స్టేడియంలోకి వచ్చాడు.దీంతో మ్యాచ్ 20 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది.
అంతర్జాతీయ క్రికెట్లో ఇలాంటి వింత కారణాలవల్ల చాలా మ్యాచులే ఆగడం లేదా రద్దవడం జరిగింది.న్యూజిలాండ్-భారత్ కాసేపు ఆగి తర్వాత సజావుగా జరగడం.భారత్ ఈ టోర్నీలో వరుసగా ఐదవ విజయాన్ని ఖాతాలో వేసుకోవడం.
కివీస్ పై పైచేయి సాధించడం క్రికెట్ ప్రేక్షకులను ఆనందపరిచింది.పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లపై భారత్ గెలిస్తే క్రికెట్ ప్రేక్షకుల సెలబ్రేషన్ లకు అడ్డు అదుపు అనేదే ఉండదు.