టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణకు( Balakrishna ) అన్ స్టాపబుల్ షోకు హోస్ట్ గా వ్యవహరించినప్పటి నుంచి అదృష్టం కలిసొస్తోంది.వరుసగా బాలయ్య విజయాలను అందుకుంటున్నారు.
బాలయ్య చిన్న కూతురు తేజస్విని ఇచ్చిన సలహాలు బాలయ్యకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బాలయ్య గత సినిమాలు అఖండ, వీరసింహారెడ్డి( Akhanda, Veerasimha Reddy ) వేర్వేరుగా 150 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించాయి.
భగవంత్ కేసరి ( Bhagwant Kesari )ఫుల్ రన్ లో 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సులువుగా సాధించే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బాలయ్య మూడు సినిమాల కలెక్షన్లు 500 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉండనున్నాయని తెలిసి నెటిజన్లు షాకవుతున్నారు.
బాలయ్య హవా నడుస్తోందని మరి కొందరు చెబుతున్నారు.రాబోయే రోజుల్లో బాలయ్య మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
బాలయ్య ప్రాజెక్ట్ లు వరుసగా సక్సెస్ సాధిస్తుండగా బాలయ్యతో సినిమాలు తెరకెక్కించడానికి చాలామంది దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.బాలయ్య రెమ్యునరేషన్ పెరుగుతుండగా ఆరు పదుల వయస్సులో కూడా బాలయ్య ఎనర్జీ లెవెల్స్ తగ్గడం లేదు.బాలయ్య కామెడీ టైమింగ్ కూడా భగవంత్ కేసరి సినిమాకు హైలెట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే.
బాలయ్యను అనిల్ రావిపూడి( Anil Ravipudi ) కొత్తగా చూపించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.ఫస్టాఫ్ యావరేజ్ గా ఉన్నా సెకండాఫ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండటంతో సినిమా సక్సెస్ సాధించింది.బాలయ్య బాబీ కాంబో మూవీ నెక్స్ట్ లెవెల్ లో తెరకెక్కుతుండగా వచ్చే ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది.
బాలయ్య మల్టీస్టారర్ సినిమాలలో నటిస్తే బాగుంటుందని మరి కొందరు ఫీలవుతుండటం గమనార్హం.ఇతర భాషల్లో కూడా బాలయ్య సక్సెస్ సాధిస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు.బాలయ్య కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది.