యాపిల్ ఐఫోన్లు బెస్ట్ పెర్ఫార్మన్స్ ఆఫర్ చేయడమే కాకుండా ఎన్నో ఉపయోగకరమైన ఫీచర్లు అందిస్తున్నాయి.ప్రాణాలను నిలబట్టే ఫీచర్స్ కూడా వీటిలో కంపెనీ ఇస్తోంది.
ఆ ఆప్షన్స్ పుణ్యమా అని ఇప్పటికే చాలామంది యూజర్లు ప్రమాదాల్లో పడినా చివరికి బతికి బయట పడగలిగారు.తాజాగా ఐఫోన్ మరొకరి ప్రాణాలు కాపాడింది.
ఈ ఘటనలో యాపిల్ ఐఫోన్ కారు ప్రమాదానికి గురైన ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడింది.వివరాల్లోకి వెళితే, ఇండిపెండెన్స్‌లాంగ్5230 అనే రెడ్డిట్ యూజర్ యాపిల్ SOS ఫీచర్( Apple SOS feature ) కారు ప్రమాదంలో తన ప్రాణాలను ఎలా కాపాడిందో పోస్ట్ ద్వారా వివరించాడు.
అతను తీవ్రంగా క్రాష్ అయిన కారులో ప్రయాణిస్తున్నాడు.యాక్సిడెంట్ జరిగాక సహాయం కోసం కాల్ చేయలేకపోయాడు, కుటుంబానికి ఏమి జరిగిందో చెప్పలేకపోయాడు.“ప్రయాణికుడిగా ఫస్ట్ టైమ్ కారు ప్రమాదంలో బాధితుడయ్యాను.కారు చాలా వరకు ధ్వంసం అయింది.అయినా నేను కొన్ని ఫ్రాక్చర్స్‌తో ప్రాణాపాయం నుంచి బయటపడటంతో వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు.” అని సదరు వ్యక్తి పోస్ట్‌లో పేర్కొన్నాడు.

యాపిల్ SOS ఫీచర్ క్రాష్‌ను గుర్తించి, ఆటోమేటిక్‌గా 911కి కాల్ చేసి, ఎమర్జెన్సీ సర్వీస్‌లకు త్వరగా మెసేజ్ పంపుతుంది.ఇది ఇండిపెండెన్స్‌లాంగ్5230 అకౌంట్ యూజర్‌కు కూడా అవసరమైన మెడికల్ కేర్ పొందడంలో సహాయపడింది.911కి కాల్ చేసి, తన ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లకు యాక్సిడెంట్ గురించి చాలా ఫాస్ట్‌గా తెలియజేసినందుకు యాపిల్ SOS ఫీచర్‌కి అతను కృతజ్ఞతలు తెలిపాడు.థాంక్యూ యాపిల్ అని తన పోస్టులో పేర్కొన్నాడు.

ప్రమాద స్థలానికి చేరుకున్న వైద్య సిబ్బంది అతని పరిస్థితి చూసి ఆశ్చర్యపోయారు.యాపిల్( Apple ) సాంకేతిక పరిజ్ఞానం వల్ల అతను ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.లేదంటే మెడికల్ హెల్ప్ మరింత ఆలస్యమై అతను మల్టిపుల్ ఫ్రాక్చర్స్ వల్ల నరక యాతన అనుభవించేవాడు.రక్తస్రావం మరింత పెరిగి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడేది.
ప్రాణాంతక పరిస్థితులలో సాంకేతికత ఎలా హెల్ప్ చేస్తుందో చెప్పడానికి యాపిల్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్.యాపిల్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్( Apple crash detection ) వివిధ రకాల వాహనాలలో ముందు, వైపు, వెనుక లేదా రోల్‌ఓవర్ తాకిడి వంటి తీవ్రమైన కార్ క్రాష్‌లను గుర్తించడం ద్వారా పని చేస్తుంది.
ఇది క్రాష్‌ను గుర్తించినప్పుడు, ఐఫోన్ లేదా యాపిల్ వాచ్‌కి అలారం మోగిస్తుంది, హెచ్చరికను చూపుతుంది.ఐఫోన్ అత్యవసర సేవలకు డయల్ చేయగలదు, అయితే వాచ్ ఎమర్జెన్సీ కాల్ ఎంపికను చూపుతుంది.