ఖలిస్తాన్ ఉగ్రవాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య వెనుక భారత ప్రభుత్వ ప్రమేయం వుండొచ్చంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ( Prime Minister Justin Trudeau ) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే.దీనిని భారత్ తీవ్రంగా పరిగణించింది.
ఇప్పటికే ఇరుదేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించగా.కెనడాలోని వీసా ప్రాసెసింగ్ కేంద్రాన్ని భారత్ మూసివేసింది.
ఇరుదేశాల మధ్య రాజీ కుదిర్చేందుకు అంతర్జాతీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయి.ఇదిలావుండగా.
కెనడా సైతం భారత్‌లోని తన దౌత్యవేత్తలను 62 నుంచి 21కి తగ్గించడంతో వీసా జారీ ప్రక్రియకు తీవ్ర విఘాతం కలుగుతోంది.అంతర్జాతీయ విద్యార్ధులు, భారత్ నుంచి కెనడా వెళ్లాల్సిన వారిపై ఇది ప్రభావం చూపుతోంది.

41 మంది దౌత్యవేత్తల నిష్క్రమణను ప్రకటిస్తూ.కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ( Minister Melanie Joly ) మాట్లాడుతూ.దురదృష్టవశాత్తూ ఈ సామూహిక బహిష్కరణ తమ కార్యకలాపాలపై ప్రభావం చూపుతుందన్నారు.గ్లోబల్ అఫైర్స్ కెనడా విడుదల చేసిన ప్రకటన ప్రకారం.తాము తదుపరి నోటీసు వచ్చే వరకు కాన్సులేట్లలో అన్ని వ్యక్తిగత సేవలను తాత్కాలికంగా పాజ్ చేయాల్సి వస్తుందన్నారు.భారత్‌లో కెనడా కాన్సులేట్లు చండీగఢ్, బెంగళూరు, ముంబైలలో వున్నాయి.
భారతదేశ నిర్ణయం ఇరు దేశాల పౌరులకు అందించే సేవలను ప్రభావితం చేస్తుందని జోలీ ఆవేదన వ్యక్తం చేశారు.అయితే ఐఆర్‌సీసీ మాత్రం భారత్ నుంచి దరఖాస్తులను ఆమోదించడం , ప్రాసెస్ చేయడం కొనసాగిస్తుందని జోలీ స్పష్టం చేశారు.

ఐదుగురు ఐఆర్‌సీసీ సిబ్బంది భారత్‌లోనే వుంటారని.అత్యవసర ప్రాసెసింగ్, వీసా ప్రింటింగ్, రిస్క్ అసెస్‌మెంట్, వీసా దరఖాస్తు కేంద్రాలు, ప్యానెల్ ఫిజిషియన్‌లు, ఇమ్మిగ్రేషన్ వైద్య పరీక్షలు నిర్వహించే క్లినిక్‌లతో సహా కీలక భాగస్వాములను పర్యవేక్షించడం వంటి విధులు వీరు నిర్వర్తిస్తారని జోలీ తెలిపారు.ఐఆర్‌సీసీ డేటా ప్రకారం.ఈ ఏడాది అంతర్జాతీయ విద్యార్ధులకు కెనడా జారీ చేసిన 4,63,910 స్టడీ పర్మిట్లలో .ఒక్క భారతీయులే 1,85,065 మంది వున్నారు.గతేడాది 5,48,955 స్టూడెంట్ వీసాలలో .భారతీయులకు 2,25,875 మంజూరయ్యాయి.ఈ ఏడాది ఆ రికార్డును అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఐఆర్‌సీసీ గణాంకాల ప్రకారం 2021లో 4,31,645 మందికి కెనడా పీఆర్ లభించగా.వీరిలో 1,27,933 మందితో భారత్ అగ్రస్థానంలో వుంది.
అంతేకాదు.ప్రతి ఏటా వేలాది మంది తాత్కాలిక ఉద్యోగులను కెనడా ఆకర్షిస్తూ వుంటుంది.