తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు.ఇందులో భాగంగా టీఎస్పీఎస్ఏ జాయింట్ డైరెక్టర్ గా రంగనాథ్ రానున్నారు.
ఈ మేరకు అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలుస్తోంది.
టీఎస్పీఎస్ఏ డిప్యూటీ డైరెక్టర్ గా రాజేంద్రప్రసాద్, సీఐడీ ఎస్పీగా శ్రీనివాస్ రెడ్డి, గ్రే హౌండ్స్ ఎప్పీగా వెంకటేశ్వర్లు, సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా నితికాపంత్, సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా రోహిత్ రాజ్, ట్రాఫిక్ డీసీపీగా వెంకటేశ్వర్లు, పెద్దపల్లి డీసీపీగా సునీతా మోహన్ బదిలీ అయ్యారు.