దగ్గుబాటి కుటుంబం( Daggubati Family ) నుంచి ఇప్పటికే ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నటువంటి వారిలో సీనియర్ నటుడు వెంకటేష్(Venkatesh ) ఒకరు అయితే ఈయన వారసులుగా ఇండస్ట్రీలోకి రానా ( Rana ) అభిరామ్ కూడా ఎంట్రీ ఇచ్చారు.ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కుమారులుగా ఈ ఇద్దరు హీరోలుగా ఇండస్ట్రీలోకి వచ్చారు అయితే రానా హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోగా నటుడు అభిరామ్ మాత్రం సినిమాలపరంగా ఏ మాత్రం సక్సెస్ కాలేకపోయారు.
ఈయన నటించిన అహింస సినిమా మాత్రమే అయినప్పటికీ ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.ఈ సినిమా తర్వాత తదుపరి సినిమా అవకాశాలు వచ్చిన ఈయన యాక్సెప్ట్ చేయలేదని తెలుస్తోంది.
ఇలా హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే డిజాస్టర్ ఎదుర్కొన్నటువంటి అభిరామ్ ( Abhiram ) తాజాగా రైటర్స్ కేఫ్ అనే కేఫ్ ప్రారంభించారని తెలుస్తోంది.ఇలా వ్యాపారా రంగంలోకి అడుగుపెట్టినటువంటి ఈయన ఈ కేఫ్ ప్రారంభించారు.ఈ క్రమంలోనే ఈయన మాట్లాడుతూ .సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలనుకునే యువ రచయితలకు సాయం చేయడం కోసమే ఈ కేఫ్ ప్రారంభించామని.అదేవిధంగా ఈయన మాట్లాడుతూ తాతయ్య గారు చనిపోయిన తర్వాత జీవితం అంటే ఏంటో నాకు తెలిసి వచ్చిందని అందుకే ఇకపై బాధ్యతగా, తనకాళ్లపై తాను నిలబడాలని నిర్ణయించుకున్నానని అభిరామ్ వెల్లడించారు.
ఒక సమయంలో తన గురించి వచ్చినటువంటి కాంట్రవర్సీల గురించి ఇంట్లో కుటుంబ సభ్యులతో మాట్లాడిన రోజులు ఉన్నాయి.అహింస సినిమా( Ahimsa Movie ) తర్వాత నాకు సినిమా అవకాశాలు వచ్చాయి కానీ నటుడిగా నేను ఇండస్ట్రీలో కొనసాగాలి అంటే సినిమాల పరంగా తాను ఎంతో శిక్షణ తీసుకోవాలని నాకు అర్థమైంది.ఇదే విషయం దర్శక నిర్మాతలకు కూడా చెప్పానని ఈయన వెల్లడించారు.
ఇకపోతే తనకు ప్రేమ కథ సినిమాలలో నటించాలని కోరికగా ఉంది అంటూ ఈ సందర్భంగా ఈయన తెలియజేశారు.అభిరామ్ వ్యవహారి శైలి కారణంగా ఎన్నో రకాల విమర్శలు వచ్చాయి అయితే ఈ వివాదాలు కారణంగానే ఈయనని దగ్గుబాటి కుటుంబ సభ్యులు అయినటువంటి వెంకటేష్ రానా ఇద్దరు కూడా దూరం పెట్టారు అంటూ వార్తలు వచ్చాయి.
ఈ వార్తలపై స్పందిస్తూ తన గురించి వస్తున్నటువంటి ఈ వార్తలన్నీ కూడా ఆ వాస్తవమేనని నేను నా కుటుంబ సభ్యులతోనే కలిసి ఉన్నానని అంత సంతోషంగా ఉన్నామని క్లారిటీ ఇచ్చారు.