కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) అంటే ఇప్పుడు పాన్ ఇండియన్ వ్యాప్తంగా ఫేమస్.ఒకప్పుడు కేవలం కోలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే ఈయన పరిమితం అయినప్పటికీ ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ రోజు స్టార్ డైరెక్టర్ గా నిలవడమే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించు కున్నాడు.
ఈయనకు ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర మంచి నేమ్ అండ్ క్రేజ్ పెరిగాయి.
బాగా డిమాండ్ ఉన్న డైరెక్టర్ లలో ఒకరిగా లోకేష్ ఉన్నారు.ఇక ఈయన గత సినిమాలు ఖైదీ, విక్రమ్( Vikram ) లతో సరికొత్త సినిమాటిక్ యూనివర్స్ కు గేట్లు తెరిచిన లోకేష్ ఆ తర్వాత మంచి క్రేజ్ సంపాదించు కున్నాడు.ఈయన సినిమాటిక్ యూనివర్స్ లో ఒక్కో హీరోను భాగం చేసుకుంటూ వస్తుండగా తాజాగా మరో హీరో పేరు చెప్పి మళ్ళీ సెన్సేషనల్ క్రియేట్ చేసాడు.
కోలీవుడ్ లో స్టార్ హీరోల్లో ఒకరైన అజిత్( Hero Ajith ) గురించి అందరికి తెలుసు.ఈయన గురించి తాజాగా లోకేష్ చేసిన కామెంట్స్ ఆయన ఫ్యాన్స్ లో వైరల్ అయ్యాయి.
తాజా ఇంటర్వ్యూలో ఈయన మాట్లాడుతూ మీ యూనివర్స్ లో ఇప్పటి వరకు చేయని స్టార్ ను ఎవరినైనా పెట్టాల్సి వస్తే ఎవరిని ఎంచుకుంటారు అని అడుగగా అజిత్ సార్ తో వర్క్ చేయాలనీ అనుకుంటున్నట్టు తెలిపాడు.
ఈ వ్యాఖ్యలు కోలీవుడ్ లో వైరల్ అయ్యాయి.కాగా లోకేష్ కనకరాజ్ కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ జోసెఫ్ తో చేసిన ‘లియో( Leo )’ సినిమా రిలీజ్ కు సిద్ధం అయ్యింది.అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.
విక్రమ్ తర్వాత చేస్తున్న ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో వేచి చూడాల్సిందే.