నందమూరి సినీ వారసుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) ఒకరు.నందమూరి తారకరామారావు మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి ఈయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ తన సినిమాలన్నింటినీ కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.ప్రస్తుతం ఈయన కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా(Devara Movie) షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమాలో ఎన్టీఆర్ విభిన్నమైన లుక్ లో కనిపించబోతున్నారు ఇక ఈ సినిమా ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీ ఈ సినిమా విడుదల కాబోతుందని మేకర్స్ ప్రకటించారు.ఇదిలా ఉండగా తాజాగా ఎన్టీఆర్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఎన్టీఆర్ తన అన్నయ్య కళ్యాణ్ రామ్ తో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఎన్టీఆర్ గురించి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు.
ఎన్టీఆర్ చాలా వంట రుచిగా చేస్తారని కళ్యాణ్ రామ్ తెలియజేశారు.అయితే ఎన్టీఆర్ మంచి కుక్( Cook ) అనే విషయం మనకు బిగ్ బాస్ కార్యక్రమం సమయంలోనే తెలుసు ఈయన బిగ్ బాస్( Bigg Boss ) హౌస్ లోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా మటన్ బిర్యానీ చేసిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఎన్టీఆర్ ఇప్పటికి ఇంట్లో ఉంటే తప్పనిసరిగా ప్రతి ఆదివారం( Sunday ) వెరైటీ డిష్ తయారు చేస్తారని అలా తయారు చేసినప్పుడు తనని కూడా ఇన్వైట్ చేస్తారు అని కళ్యాణ్ రామ్ తెలియజేశారు.
ఇక ఈయన ఏదైనా ఫ్రస్టేషన్ లో ఉన్నప్పుడు కూడా కుక్ చేస్తారని, ఇలా వంట చేయటం వల్ల తమ్ముడికి ఉన్నటువంటి ఫ్రస్టేషన్ మొత్తం తొలగిపోతుందని ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ తెలిపారు.ఇక తాను వంట చేస్తే తన భార్య చాలా ఇష్టంగా తింటుందని తారక్ తెలిపారు.ఒక రోజు తాను వంట చేస్తున్న సమయంలో ఒక వంద క్యారేజీలు తయారు చేసి పెట్టు అమ్మి పెడతాను అంటూ సరదాగా మాట్లాడారు అంటూ ఎన్టీఆర్ తెలియజేశారు.దీంతో వెంటనే కళ్యాణ్ రామ్ ఏదైనా సైడ్ బిజినెస్ ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నావా అంటూ కూడా ఎన్టీఆర్ ను అడగగా తాను ఫ్రస్టేషన్ నుంచి బయటకు రావడం కోసమే వంట చేస్తాను కానీ ఇలా బిజినెస్ చేయడానికి మాత్రం కాదు అంటూ ఎన్టీఆర్ సరదాగా తెలిపారు.
ఇలా ఇప్పటికి ఎన్టీఆర్ ఆదివారం కనుక ఇంట్లో ఉంటే వంట బాధ్యత మొత్తం ఎన్టీఆర్ దే అంటూ కళ్యాణ్ రామ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.