భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్న భారత ఆటగాళ్లు వీళ్లే..!

ప్రపంచ క్రికెట్లో భారత్-పాకిస్తాన్( Ind vs Pak ) మధ్య జరిగే మ్యాచ్ ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటుంది.ఈ జట్ల మధ్య మ్యాచ్ కోసం ఇరుదేశాల క్రికెట్ అభిమానులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రికెట్ అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా వీక్షిస్తారు.

 Indian Cricketers Who Won Player Of The Match Award Against Pakistan Bumrah Sach-TeluguStop.com

వరల్డ్ కప్, ఆసియా కప్ లాంటి టోర్నీలలో మాత్రమే ఈ రెండు జట్లు తలబడతాయి.కాబట్టి ఈ జట్ల మధ్య జరిగే మ్యాచ్ కు క్రేజ్ చాలా ఎక్కువ.

ప్రేక్షకులకే ఇలా ఉంటే.బరిలోకి దిగి ఆడే ఇరుజట్ల ఆటగాళ్లకు ఈ మ్యాచ్ ఎంత ప్రత్యేకంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇరుజట్లు గెలుపు కోసం చివరి వరకు చాలా కసితో పోరాడతాయి.ఇక ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్లో అద్భుత ఆటను ప్రదర్శించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్( Player Of The Match ) అవార్డు గెలిస్తే.ఆ ఆటగాడి ఆనందానికి అవధులు ఉండవు.తాజాగా వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా భారత్- పాకిస్తాన్ మ్యాచ్ లో భారత జట్టు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును బౌలర్ బుమ్రా( Jasprit Bumrah ) దక్కించుకున్నాడు.

వరల్డ్ కప్ లలో ఇప్పటివరకు జరిగిన భారత్- పాకిస్తాన్ మ్యాచ్లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు ఎవరెవరు అందుకున్నారో చూద్దాం.భారత జట్టు మాజీ స్టార్ దిగ్గజం సచిన్ టెండుల్కర్( Sachin Tendulkar ) 1992, 2003, 2011 వరల్డ్ కప్ లలో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకుని ఈ జాబితాలో టాప్ లో నిలిచాడు.1996లో నవజ్యోత్ సిద్దు,( Navjot Sidhu ) 1999లో వెంకటేష్ ప్రసాద్,( Venkatesh Prasad ) 2015లో విరాట్ కోహ్లీ, 2019లో రోహిత్ శర్మ, 2023లో తాజాగా జస్ ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube