ఆ దెబ్బతో నా కొంప మునిగిపోయింది : రాజేంద్ర ప్రసాద్

రాజేంద్ర ప్రసాద్( Rajendra Prasad ). నట కిరీటిగా నవ్వుల రారాజుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాదాపు 50 ఏళ్లుగా స్థిరపడిపోయి ఉన్నారు.

 Rajendra Prasad About Movie Production ,rajendra Prasad,comedian Roles, Quick Gu-TeluguStop.com

ఆయన హ్యూమర్ అనే ఒక అద్భుతమైన జోనర్ లో వందల కొద్ది సినిమాల్లో హీరోగా నటించారు.డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ను మొదలుపెట్టి నేటి వరకు ఆయన ఎక్కడా కూడా ఒక రోజు కూడా గ్యాప్ తీసుకుని ఎరుగరు.

కామెడీతో హీరోయిజం( Comedy ) కూడా చేయొచ్చని నిరూపించిన వ్యక్తిగా రాజేంద్రప్రసాద్ పేరు చరిత్రపుటల్లో నిలిచిపోతుంది.ఆయన ఆదర్శంగా తీసుకొని ఆ తర్వాత తరంలో ఎంతోమంది కమీడియన్స్ హీరోలుగా తమ కెరియర్ ను మలుచుకున్నారు.

అందులో కొంత మంది సక్సెస్ అయితే మరి కొంతమంది మళ్ళీ కామెడీ మార్గంగా ఎంచుకొని ముందుకు వెళుతున్నారు.

Telugu Gun Murugan, Rajendra Prasad-Movie

చాలామంది కమెడియన్స్( Comedians ) కి లేని అద్భుతమైన వరం రాజేంద్రప్రసాద్ కి సొంతం.ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు హాలీవుడ్ లో కూడా క్విక్ గన్ మురుగన్( Quick Gun Murugan ) అనే ఒక కామెడీ భరితమైన సినిమాలో నటించారు.ఇక నటన పైనే కాదు దర్శకత్వం, నిర్మాణం, సంగీత దర్శకత్వం వంటి అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా రాజేంద్రప్రసాద్ కి మంచి టేస్ట్ ఉంటుంది.

అందువల్ల ఆయన కేవలం నటుడిగా ఆగిపోలేదు 1996లో వచ్చిన టోపీ రాజా స్వీటీ రోజా అనే ఒక సినిమాకి సంగీత దర్శకత్వం అభిరుచి ఏంటో అందరికీ తెలియజేశారు.ఈ చిత్రంలో హీరోగా రాజేంద్రప్రసాద్ నటించిన రోజా హీరోయిన్ గా నటించింది.

Telugu Gun Murugan, Rajendra Prasad-Movie

ఇక తన కెరియర్ లో రెండు సినిమాలకు నిర్మాణం కూడా చేపట్టాడు అయితే అనుకున్న విధంగా ఆ సినిమాలు ఆడక పోవడంతో ఆయన తన 90 శాతం ఆస్తులను కోల్పోవాల్సి వచ్చిందట.అందుకే ఆ పని ఇక తన వల్ల కాదని మళ్లీ నటనని నమ్ముకుని కెరీర్ ను కొనసాగించారు.నిర్మాతల కష్టం తెలిసిన వాడిని కాబట్టి ఈరోజు నాకు ఇంత ఇవ్వమని డిమాండ్ చేయలేదని 10000 ఒప్పుకుని 5000 ఇచ్చిన ఎంతో సంతోషంగా చేసి వెళ్ళానే తప్ప ఎవరిని తన పారితోషకం పెంచమని చెప్పలేదంటూ ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube